Bandla Ganesh : ప్రజలను మేనేజ్ చేయలేరు.. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తున్నాం
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) బుధవారం గాంధీభవన్(Gandhi Bhavan)కు వెళ్లారు. అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే షాద్ నగర్ పోయిన.. మిత్రుడు వీర్లపల్లి శంకర్(Veerlapally Shankar) నామినేషన్ వేస్తే ఊరు దాటడానికి గంట పట్టిందన్నారు. జనాలు కాంగ్రెస్(Congress) వైపు చూస్తున్నారని అన్నారు..
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) బుధవారం గాంధీభవన్(Gandhi Bhavan)కు వెళ్లారు. అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే షాద్ నగర్ పోయిన.. మిత్రుడు వీర్లపల్లి శంకర్(Veerlapally Shankar) నామినేషన్ వేస్తే ఊరు దాటడానికి గంట పట్టిందన్నారు. జనాలు కాంగ్రెస్(Congress) వైపు చూస్తున్నారని అన్నారు.. సోషల్ మీడియాను, నాయకులను మేనేజ్ చేయచ్చు కానీ.. ప్రజలను మేనేజ్ చేయలేరని బీఆర్ఎస్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నవంబర్ 30 కోసం ఎదురు చూస్తున్నారు.. కాంగ్రెస్ అద్భుతం స్తృష్టిస్తుందని జోష్యం చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ త్యాగాలు చేసిందన్నారు.
దేశం కోసం రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సేవ చేస్తున్నారు.. కురుక్షేత్ర మహా సంగ్రామంలో కాంగ్రెస్ ఘన విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నామన్నారు. నేను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తని.. ఇంత వరకూ కాంగ్రెస్ కు తప్ప వేరే పార్టీకి ఓటేయలేదని బండ్ల గణేష్ అన్నారు. రాహుల్ గాందీ ఏనాడు హద్దులు దాటి మాట్లాడలేదని.. బీఆర్ఎస్ లో మంత్రులు ఎవరు.? కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు ఎవరనేది సంబంధం లేదన్నారు.