బండ్ల గణేశ్(Bandla Ganesh) గురించి ఇంట్రడక్షన్ అనవసరం. ఆయన గురించి తెలియనివారు తెలుగునాట ఉండకపోవచ్చు. ఒకప్పుడు సినిమాల్లో కమెడియన్. అది కూడా ఫుల్‌లెంగ్త్ కాదు. చిన్న చిన్న పాత్రలలో కనిపించే కమెడియన్. తర్వాత నిర్మాత అయ్యారు. భారీ చిత్రాలను నిర్మించారు. తదనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ(congress) నాయకుడయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్(BRS) ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
బండ్ల గణేశ్(Bandla Ganesh) గురించి ఇంట్రడక్షన్ అనవసరం. ఆయన గురించి తెలియనివారు తెలుగునాట ఉండకపోవచ్చు. ఒకప్పుడు సినిమాల్లో కమెడియన్. అది కూడా ఫుల్‌లెంగ్త్ కాదు. చిన్న చిన్న పాత్రలలో కనిపించే కమెడియన్. తర్వాత నిర్మాత అయ్యారు. భారీ చిత్రాలను నిర్మించారు. తదనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ(congress) నాయకుడయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్(BRS) ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలతో విరుచుకుపడ్డారు బండ్ల గణేశ్. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు గణేశ్. రేవంత్‌రెడ్డి(Revanth reddy) ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా అన్నారు. 2018 ఎన్నికలప్పుడు కూడా ఇలాగే అన్నారు. కాంగ్రెస్ గెలవకపోతే సెవనోక్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానన్నారు. తర్వాత మాట మార్చారనుకోండి.. అది వేరే విషయం. అయితే ఈసారి మాత్రం గణేశ్ చెప్పినట్టుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత బండ్ల గణేశ్ గాంధీభవన్‌లో(Gandhi Bhavan) ఎక్కువగా కనిపించారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం(Lok sabha) నుంచి పోటీ చేయాలని బండ్ల గణేశ్ అనుకుంటున్నారని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. మల్కాజ్‌గిరి టికెట్‌ను ఆయన ఆశించారు. టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ టికెట్ కోసమే బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ మాటకొస్తే పాత కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువగానే గులాబీ నేతలను తిట్టిపోశారు. అలాంటి బండ్ల గణేశ్ ఇప్పుడెందుకో సైలెంట్ అయిపోయారు. గాంధీభవన్‌లో కూడా కనిపించడం లేదు. అంతకు ముందు రోజూ గాంధీభవన్‌కు వచ్చి హడావుడి చేసిన బండ్ల ఇప్పుడెందుకు కనిపించడం లేదు? ఎందుకు మైకుల ముందుకు రావడం లేదు? కారణాలేమిటో ఈ వీడియోలో చూద్దాం..