తెలంగాణలో(Telangna) ఈసారి ఎన్నిక‌ల‌లో(Elections) కాంగ్రెస్(Congress) పార్టీ ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్(Bandla Ganesh) అన్నారు. మంగళవారం ఆయ‌న మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ(Nalgonda), ఖమ్మం(Khammam) జిల్లాల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఖాతా తెరవదని.. ఆ రెండు జిల్లాలను కాంగ్రెస్‌ పూర్తిగా కైవసం చేసుకుంటుందని అన్నారు.

తెలంగాణలో(Telangna) ఈసారి ఎన్నిక‌ల‌లో(Elections) కాంగ్రెస్(Congress) పార్టీ ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్(Bandla Ganesh) అన్నారు. మంగళవారం ఆయ‌న మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ(Nalgonda), ఖమ్మం(Khammam) జిల్లాల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఖాతా తెరవదని.. ఆ రెండు జిల్లాలను కాంగ్రెస్‌ పూర్తిగా కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని జోష్యం చెప్పారు.

కాంగ్రెస్ విజ‌యం సాధిస్తుంద‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదని బండ్ల గ‌ణేష్ అన్నారు. తాను మీడియాలో కనిపించకున్నా.. ప్రతీ రోజూ పార్టీ కోసం పాటుపడుతున్నానని చెప్పారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించాను.. కానీ ఈసారి నాకు ఇష్టమైన రేవంత్ రెడ్డి సీఎం రేసులో ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. రేవంత్‌ పదవిలో కూర్చుంటే.. నేను అధికారాన్ని సొంతం చేసుకొన్నట్టేన‌ని బండ్ల గణేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Updated On 14 Nov 2023 7:21 AM GMT
Ehatv

Ehatv

Next Story