కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. శుక్రవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన..

Bandi Sanjay to meet Prime Minister Modi
కరీంనగర్ ఎంపీ(Karimnagar MP), బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ కానున్నారు. శుక్రవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన.. మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ కానున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. మోదీ ఆశీస్సులు తీసుకోనున్నారు.
గత నెలలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి(Kishan Reddy)కి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత సంజయ్‌ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సంజయ్ శుక్రవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్(Hyderabad) వచ్చి.. ఆ తర్వాత శంషాబాద్‌లో మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు(Telangana State BJP (Chief) కిషన్ రెడ్డి సహా పలువురు పాల్గొంటారు.
