భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్(Congress) ఎంపీ డీకే సురేష్(DK Suresh) చేసిన వ్యాఖ్యలను బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ(Lok sabha) సభ్యుడు బండి సంజయ్ కుమార్(Bandi sanjay Kumar) తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలకు(Congress leaders), టెర్రరిస్టులకు(Terrorists) తేడా ఏముందని ప్రశ్నించారు.

భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్(Congress) ఎంపీ డీకే సురేష్(DK Suresh) చేసిన వ్యాఖ్యలను బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ(Lok sabha) సభ్యుడు బండి సంజయ్ కుమార్(Bandi sanjay Kumar) తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలకు(Congress leaders), టెర్రరిస్టులకు(Terrorists) తేడా ఏముందని ప్రశ్నించారు. కాశ్మీర్ ను ప్రత్యేక దేశం కావాలని టెర్రరిస్టులు, పంజాబ్ ను ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని ఉగ్రవాదులు చెబుతున్నాని, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ సురేష్ భారత్ ను దక్షిణ దేశంగా, ఉత్తర దేశంగా విభజించాలని అంటున్నాడని బండి చెబుతూ మరి వాళ్లకు, వీళ్లకు తేడా ఏమిటి? అని ప్రశ్నించారు. గతంలో రాహుల్ గాంధీ సైతం భారతీయుడిగా చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నానని చెప్పి దేశాన్ని కించపరిచాడని అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై దేశ ద్రోహ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. భారత్ ను ముక్కలు చేయాలని కోరడం ముమ్మాటికీ దేశ ద్రోహమేనని, ప్రజలంతా వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇండియా కూటమిలో చీలకలు మొదలయ్యాయని,

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) ఆ కూటమి నుండి బయటకు రావడంతోపాటు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Banerjee) కాంగ్రెస్ పై చేసిన విమర్శలే ఇందుకు నిదర్శనమన్నారు. అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తగా ఉన్నందుకు గర్వపడుతున్నామని, తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పద్మ అవార్డులు ఇచ్చిన ఘనత బీజేపీదేనని చెబుతూ, గతంలో పైరవీలు చేసుకునే వారికే అవార్డులు వచ్చేవని, మోదీ హయాంలో పైరవీలు, అవినీతికి తావులేకుండా నిపుణులైన వారికే అవార్డులు వరిస్తున్నాయని తెలిపారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది తామేనని, ఏం చేసుకుంటారో చేస్తోండని సవాల్‌ విసిరారు. అయోధ్యలో రామమందిరం స్థానంలో బాబ్రీమసీదును నిర్మిస్తామని చెప్పే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని బండి ప్రశ్నించారు.

Updated On 3 Feb 2024 7:07 AM GMT
Ehatv

Ehatv

Next Story