బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం రైతు దీక్ష చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. రూ.2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, రూ.500 బోనస్ డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా బండి సంజయ్ కుమార్ దీక్ష చేపట్ట‌నున్న‌ట్లు ఇప్ప‌టికే తెలిపారు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం రైతు దీక్ష చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. రూ.2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, రూ.500 బోనస్ డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా బండి సంజయ్ కుమార్ దీక్ష చేపట్ట‌నున్న‌ట్లు ఇప్ప‌టికే తెలిపారు. అయితే.. కలెక్టరేట్ వద్ద రైతు దీక్ష చేప‌ట్టాల‌ని బండి సంజ‌య్ భావించ‌గా.. అందుకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు.

దీంతో కరీంనగర్ పార్లమెంటు కార్యాలయం వద్ద దీక్ష‌ తలపెట్టారు. రైతు దీక్షకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు పరిధిలోని రైతులు దీక్ష‌కు తమ మద్దతును తెలియజేస్తున్నాయి. రైతు సంఘాలు దీక్ష స్థలానికి కూడా రానున్నారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొన‌సాగే ఈ దీక్షలో బండి సంజయ్ కుమార్ సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

Updated On 1 April 2024 10:16 PM GMT
Yagnik

Yagnik

Next Story