పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీతో పొత్తుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్‌‌తో ఎలాంటి పొత్తు ఉండదని బండి తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని.. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే మూర్ఖత్వపు పార్టీ బీజేపీ కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదని.. ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీది మూడవ స్థానమేనని జోస్యం చెప్పారు. మూడో స్థానంలో నిలిచే పార్టీతో 10 సీట్లు గెలిచే సత్తా ఉన్న బీజేపీకి పొత్తు ఉంటుందా అని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే పోటీ అని తేల్చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌తో పొత్తుపై స్పందించిన బండి.. అలాంటిదేమి లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అసలు పొంతనే లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా బీసీలను మోసం చేసిందన్నారు. బడ్జెట్ లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారని.. వారు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్లు అవసరం అని బండి చెప్పుకొచ్చారు.

Updated On 12 Feb 2024 12:04 AM GMT
Yagnik

Yagnik

Next Story