తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు బెదిరింపులు వచ్చేవని బీజేపీ ఎంపీ, పార్టీ మాజీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తెలిపారు.

Bandi Sanjay About Threatening Calls
తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు బెదిరింపులు వచ్చేవని బీజేపీ ఎంపీ, పార్టీ మాజీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) తెలిపారు. చార్మినార్(Charminar) వద్ద బీజేపీ(BJP) సభ పెడితే.. తన భార్య తలను నరికి బహుమతిగా పంపిస్తామని.. కొడుకులను కిడ్నాప్(Kidnap) చేస్తామని బెదిరించారని.. అయితే బెదిరింపులకు భయపడకుండా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో చార్మినార్ ఎదుటే సభను నిర్వహించామని వెల్లడించారు. పార్టీ కోసం తెగించి, ధైర్యంగా ముందుకు వెళ్లిన చరిత్ర తమదని అన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే(Goshamahal Mla) రాజాసింగ్(Rajasingh) కు కూడా తనకులాగే ఎన్నో బెదిరింపులు వచ్చాయని.. ఆయనను చంపేస్తామని బెదిరించారని సంజయ్ పేర్కొన్నారు. అయినా.. రాజాసింగ్ భయపడకుండా హిందూ ధర్మం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. బీజేపీకి ఏడాది పాటు దూరమైనా.. ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నారని అన్నారు. బీజేపీ గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. బీజేపీ గెలిస్తే బీసీ నేత సీఎం అవుతారని అన్నారు.
