బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Yellamma) అమ్మవారి కళ్యాణోత్సవం జూన్ 20న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో(MCRHRD) సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Thalasani srinivas yadav).
బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Yellamma) అమ్మవారి కళ్యాణోత్సవం జూన్ 20న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో(MCRHRD) సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Thalasani srinivas yadav). జూన్ 19న ఎదుర్కోళ్లు, 20న అమ్మవారి కళ్యాణం, 21న రథోత్సవం జరుగుతాయి. ఈ వేడుకలను చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి 8 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ సంవత్సరం 15 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు.