మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఈసీఐఎల్ కంపెనీ క్యాంటీన్‌లో వండిన పప్పులో పాము కనపడటంతో తీవ్ర కలకలం రేపింది. దీంతో చర్లపల్లిలోని ఈసీఐఎల్, ఈయంఎస్‌డీ కంపెనీలో నైట్ డ్యూటీకి వచ్చిన కార్మికులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు.
మేడ్చల్(Medchal) జిల్లా మల్కాజిగిరి(Malkajgiri) ఈసీఐఎల్ కంపెనీ క్యాంటీన్(ECIL Company Canteen)లో వండిన పప్పులో పాము కనపడటంతో తీవ్ర కలకలం రేపింది. దీంతో చర్లపల్లి(Charlapalli)లోని ఈసీఐఎల్ కంపెనీలో నైట్ డ్యూటీకి వచ్చిన కార్మికులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. క్యాంటీన్‌లో వండిన పప్పు కూరలో పాము రావడంతో భయాందోళనలకు గురైన కార్మికులు(Workers) పెద్ద ఎత్తున నిరసన(Protest) చేపట్టారు. కంపెనీ యాజమాన్యం ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచిందని.. లోలోపల వర్కర్స్‌కు ట్యాబ్లెట్లు(Tablets), ఇంజెక్షన్లు(Injections) ఇచ్చి ఇంటికి పంపారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. బయటకు చెబితే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బ్లాక్ మెయిల్(Blackmail) చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
డ్యూటీ ముగిసిన తరువాత బయటకు వచ్చి తెలియచేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. క్యాంటీన్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని.. క్యాంటీన్ యాజమాన్యంపై చర్యలు తిస్కోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 150 మందికి పైగా ఆహారాన్ని తీసుకుని అస్వస్థతకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ఆరోగ్యం పట్ల కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.