శాసనభ సమావేశాల(assembly sessions) ప్రారంభానికి ముందు మార్షల్స్(Marshals) మాక్ డ్రిల్ చేశారు.
శాసనభ సమావేశాల(assembly sessions) ప్రారంభానికి ముందు మార్షల్స్(Marshals) మాక్ డ్రిల్ చేశారు. అది చూసి చాలా మంది ఎందుకిదంతా? అని అనుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) ముందు జాగ్రత్తగానే వారితో మాక్‌డ్రిల్ చేయించారేమోననిపిస్తోంది గురువారం జరిగిన సంఘటనలు చూస్తే! చాలా కాలం తర్వాత అసెంబ్లీలో మార్షల్స్‌కు పని దొరికింది. ఆడబిడ్డలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్(Brs) ఎమ్మెల్యేలు బుధవారం నుంచి నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీఎం అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడమే కాకుండా వెల్ లో నేలపై కూర్చొని ఆందోళన చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం చాంబర్ ఎదుట బైఠాయించారు. అప్పుడు ఎంటరయ్యారు మార్షల్స్ . బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి బయటకు మోసుకువచ్చారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎంట్రన్స్ ఎదుట బైఠాయించి ఆందోళన కొనసాగించారు. చీఫ్ మార్షల్ ఆధ్వర్యంలో అసెంబ్లీ మార్షల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి ప్రత్యేక వ్యాన్‌లలో తెలంగాణ భవన్(Telangana bhavan) కు తరలించారు.