దానం నాగేందర్‌కు కౌశిక్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
అసెంబ్లీలో(assembly) దానం నాగేందర్(dhanam nagender) వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిండు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి(MLA Kaushi reddy). దానం నాగేందర్ నువ్వు మమ్మల్ని హైదరాబాద్‌లో తిరగనియ్యవా, ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డునే ఉన్నా నీకు దమ్ముంటే ఏడికి రమ్మంటవో చెప్పు ఆడికి వస్త, ఖైరతాబాద్ రమ్మంటవా అశోక్‌నగర్‌కు రమ్మంటే వస్తా అని అన్నడు కౌశిక్‌రెడ్డి. నువ్వు రౌడీజం చేస్తానంటే.. నువ్వు భయపెడితే ఈడ భయపడేటోడు ఎవడు లేడు. దానం నాగేందర్ నువ్వు మర్చిపోయి ఉంటవ్.. గతంలో మనం కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, నువ్వు ఇట్లాంటి పిచ్చికూతలు కూసినప్పుడు నిన్ను ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నిన్ను ఉరికిచ్చింది మర్చిపొయినవా. మళ్లొకసారి ఉరికియ్యాల్నా అని కౌశిక్ రెడ్డి హెచ్చరించాడు. ఏదో ఒకరోజు మళ్లీ అదే అయితది. 65 ఏండ్లు ఉన్న నీకే అంత దూల ఉంటే 39 ఏండ్లు ఉన్న నాకు ఎంత దూల ఉంటది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కౌశిక్‌రెడ్డి చెప్పాడు. పౌడర్ కొట్టుకొని టి-షర్ట్ వేసుకొని తాజ్ కృష్ణల ఆడే ఇండోర్ గేమ్స్ అన్నీ మాకు తెలుసు. ఆ ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకున్నావా? నువ్వు భయపెట్టిస్తే, బెదిరిస్తే ఇక్కడ ఎవ్వడు భయపడడు. ఇక్కడ ఉన్నది కేసీఆర్ శిష్యులం తస్మాత్ జాగ్రత్త. ఇంత మొగోనివైతే నీకు, సిగ్గు, శరం, లజ్జ ఉంటే కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యేవి అయినవ్. ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిచి మళ్లీ మాట్లాడు దానం నాగేందర్ అని పాడి కౌశిక్ రెడ్డి.