Asifabad : ఛీఛీ.. వివాహేతర సంబంధం కోసం భర్తకు చిత్రహింసలు, హత్య
ఆసిఫాబాద్(Asifabad) జిల్లా దహెగాం మండలంలో ఓ మహిళ చేసిన పనికి సభ్య సమాజం తలదించుకుంటోంది. ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో అని ఆందోళన చెందుతున్నారు. మహిళలను భర్తలు హింసిస్తే ఎన్నో కేసులు ఉన్నాయి, వారికి అండగా నిలిచేందుకు మహిళా సంఘాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మహిళలకు అన్యాయం జరిగితే కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి. కానీ అదే సమయంలో భర్తలే(Husband) భార్యల(Wife) చేతిలో హింసకు గురై చివరికి ప్రాణాలు కోల్పోతున్నా ఇలాంటి అభాగ్యులకు ఎవరు అండగా ఉండాలనేదే నేటి ప్రశ్న. ఆసిఫాబాద్‌జిల్లా దహెగాం(Dahegam) మండలంలో వివాహేతర సంబంధం(Extra marital affair) పెట్టుకున్న భార్య భర్తను చంపేసింది. అంతకు ముందు భర్తను నానా చిత్ర హింసలు(Torture) పెట్టింది. అతని వృషణాలపై దాడి చేసి ఎందుకు పనికిరానివాడని ముద్ర వేసింది. భార్య పెట్టే హింసలను మౌనంగా భరించాడు. భార్యతో దూరంగా ఉంటున్నా తనని వదిలిపెట్టలేదు ఈ కామాంధురాలు. గొంతు నులిమి హత్య చేసి అనారోగ్యంతో చనిపోయాడని నమ్మబలికింది.
దహేగాం పోలీసులు వెల్లడించిన ప్రకారం బండ మల్లేష్ (33) అనే వ్యక్తికి ఎల్లూరుకు చెందిన సుజాతతో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 11 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు గుర్ల రాజు (23)తో సుజాత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త మల్లేష్‌కు తెలియడంతో ఇంకా బరితెగించింది. ఎలాగూ భర్తకు తెలిసిపోయిందని ఇంకా రెచ్చిపోయింది. భర్తను సంసారానికి పనికి రాకుండా చేయాలని మల్లేష్ వృషణాలపై ప్రియుడితో దాడి చేయించింది. ప్రాణాలతో బయపడిన మల్లేష్, తన భార్య చేసిన పనితో ఆమెతో దూరంగా ఉంటున్నాడు. అయితే మృత్యువు వెంటాడుతుండగా మల్లేష్ మత్రం ఏం చేయగలడు. 4 నెలల క్రితం సుజాత తల్లిదండ్రులు వచ్చి మల్లేష్‌కు నచ్చజెప్పి మళ్లీ ఒకటి చేశారు. కానీ సుజాత తన 'తొడ సంబంధం' వదులుకోలేకపోయింది. రాజుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే భర్త మల్లేష్‌ను హింసించడం మళ్లీ ప్రారంభించింది. మల్లేష్‌కు తిండి పెట్టకపోవడంతో నీరసించిపోయాడు. అనారోగ్యంతో ఇంట్లో ఉండడంతో రాజుతో కలిసి భర్తను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.
ఈ క్రమంలోనే ఈ నెల 25న మల్లేష్ పడుకొని ఉండడంతో అతని గొంతు నులిమి చంపే ప్రయత్నంచేసింది. మల్లేష్ స్పృహ కోల్పోయాడు, ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన మల్లేష్ సోదరుడు, సోదరి ఇది గమనించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మల్లేష్‌కు మాటపడిపోయింది. అయినా తన సంజ్ఞలతో ఏదో చెప్పబోయాడు. ఆసమయంలో ఇతని చికిత్స ముఖ్యం అనుకొని ఎవరూ పట్టించుకోలేదు. వైద్యచికిత్స తర్వాత కోలుకున్న మల్లేష్‌కు మరోసారి అనారోగ్యం రావడంతో 28న ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. కానీ సుజాత ప్రవర్తనపై కొంత అనుమానం మల్లేష్ బంధువులకు ఉంది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు మల్లేష్ ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేశాడని గుర్తుతెచ్చుకున్న బంధువులు వెంటనే సుజాతను గట్టిగా నిలదీశారు. దీంతో తానే భర్తను గొంతునులిమి చంపానని నేరం అంగీకరించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సుజాత, రాజును అరెస్ట్ చేశారు పోలీసులు.