నిజామాబాద్(Nizamabad) రూరల్ మల్లారం అటవీ ప్రాంతంలో(Mallaram Forest Area) చోటు చేసుకున్న హత్య కేసును(Murder Case) పోలీసులు చేధించారు. మృతుడి కుడిచేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఇంద్రాపూర్ కాలనీకి చెందిన 35 ఏళ్ల గర్‌డ్కర్ సయాజీగా(Gardkar Sayaji) గుర్తించారు పోలీసులు. దర్యాప్తు మొదలు పెట్టారు. సయాజీ నిత్యం మందుతాగి భార్య అశ్వినిని వేధించేవాడు. ఈ క్రమంలో అశ్వినికి తన మేనత్త కొడుకు అయిన రామ్ జింజోర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
నిజామాబాద్(Nizamabad) రూరల్ మల్లారం అటవీ ప్రాంతంలో(Mallaram Forest Area) చోటు చేసుకున్న హత్య కేసును(Murder Case) పోలీసులు చేధించారు. మృతుడి కుడిచేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఇంద్రాపూర్ కాలనీకి చెందిన 35 ఏళ్ల గర్‌డ్కర్ సయాజీగా(Gardkar Sayaji) గుర్తించారు పోలీసులు. దర్యాప్తు మొదలు పెట్టారు. సయాజీ నిత్యం మందుతాగి భార్య అశ్వినిని వేధించేవాడు. ఈ క్రమంలో అశ్వినికి తన మేనత్త కొడుకు అయిన రామ్ జింజోర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 3వ తేదీన ఎప్పటిలాగే సయాజీ తాగి వచ్చి అశ్వినిని(Ashwini) కొట్టాడు. తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రోజూ తనను హింసపెడుతున్న భర్తపై కోపం పెంచుకున్న అశ్విని విషయాన్ని ప్రియుడు రామ్ జింజోర్‌కు(Ram Jinjore) తెలిపింది. ఇద్దరూ కలిసి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే రామ్ జింజోర్, సయాజీ ఇద్దరు కలిసి మల్లారం అటవీ ప్రాంతానికి వచ్చి మద్యం సేవించారు. తర్వాత రామ్ జింజోర్ తన వెంట తీసుకువచ్చిన కత్తితో సయాజీ గొంతు కోసి చంపేశాడు. అటు పిమ్మట అక్కడి నుంచి పారిపోయి వచ్చి విషయాన్ని అశ్వినికి చెప్పాడు. హత్య కేసులో అశ్విని, రామ్ జింజోర్‌ను అరెస్టు చేసిన పోలీసులు వారి దగ్గర్నుంచి హత్యకు వినియోగించిన కత్తి,రెండు సెల్‌ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.