కల్వకుర్తి(Kalwakurti) దగ్గర రోడ్డు ప్రమాదంలో(Road Accident) ఓ వ్యక్తి గాయపడ్డాడు. రోడ్డుపై గాయాలతో గిలాగిలా కొట్టుకుంటున్నాడు. అటుగా వెళ్తున్న మరో యువకుడు అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనగా ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హృదయవిదారకరమైన ఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ల(Mahaboobnagar) జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కల్వకుర్తి(Kalwakurthy) దగ్గర రోడ్డు ప్రమాదంలో(Road Accident) ఓ వ్యక్తి గాయపడ్డాడు. రోడ్డుపై గాయాలతో గిలాగిలా కొట్టుకుంటున్నాడు. అటుగా వెళ్తున్న మరో యువకుడు అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనగా ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హృదయవిదారకరమైన ఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ల(Mahaboobnagar) జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కల్వకుర్తిలోని ఇందిరానగర్‌కాలనీలో ఉండే నవాజ్(Nawaz) టైలరింగ్(Tailoring) చేసేవాడు. ఇతనికి 10 రోజుల క్రితమే కూతురు పుట్టింది. జడ్చర్లలో ఉన్న కూతురును చూసేందుకు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కల్వకుర్తి మండలం మార్చాల దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నవాజ్‌కు గాయాలయ్యాయి.
ఆ సమయంలోనే హాలియా నుంచి కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామానికి వెళ్తున్న పాల వ్యాన్ క్లీనర్ అశోక్(Ashok).. నవాజ్‌ను చూసి కాపాడే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే కల్వకుర్తి వైపు వెళ్తున్న మరో గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవాజ్‌తో పాటు అశోక్ కూడా మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. నవాజ్‌కు పెళ్లి జరిగి 11 నెలలు.. 10 రోజుల క్రితమే కూతురు జన్మించడంతో ఆస్పత్రి వద్ద నవాజ్ కుటంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
మరోవైపు కనిమెట్ట దగ్గరలో ఉన్న డెయిరీ మిల్క్ ఫ్యాక్టరీలో లారీ క్లినర్‌గా పనిచేస్తున్నాడు. మానవత్వమే తన ప్రాణాలు తీసుకుంటుందని అశోక్ ఊహించలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.