తెలంగాణ(Telangana)లో అధికారంలోకి వస్తే ముస్లింల కోటా(Muslim quota)ను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit shah) చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనిపై మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ(Asaduddin Owaisi) కూడా తన స్టయిల్‌లో కౌంటర్‌ ఇచ్చారు. మతం ఆధారంగా ముస్లింలు రిజర్వేషన్లు పొందడం లేదన్న విషయాన్ని అమిత్‌ షా తెలుసుకుంటే మంచిదని ఓవైసీ అన్నారు.

తెలంగాణ(Telangana)లో అధికారంలోకి వస్తే ముస్లింల కోటా(Muslim quota)ను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit shah) చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనిపై మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ(Asaduddin Owaisi) కూడా తన స్టయిల్‌లో కౌంటర్‌ ఇచ్చారు. మతం ఆధారంగా ముస్లింలు రిజర్వేషన్లు పొందడం లేదన్న విషయాన్ని అమిత్‌ షా తెలుసుకుంటే మంచిదని ఓవైసీ అన్నారు. డేటా ఆధారంగా వెనుక‌బ‌డిన ముస్లింలకు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించార‌ని, సుధీర్ క‌మీష‌న్ రిపోర్టును చదవితే తెలుస్తుందని అన్నారు.

సుప్రీంకోర్టు(Supreme Court) స్టే ఇవ్వ‌డంతో ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు కొనసాగుతున్నయని ఓవైసీ పేర్కొన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేయడం మినహా తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్‌ లేనది ఓవైసీ అన్నారు. పదే పదే ఓవైసీ ఓవైసీ అంటూ ఇంకెన్నాళ్లే ఏడుస్తారని ఓవైసీ తెలిపారు. ఉత్త డైలాగులు ఎన్నాళ్లు చెబుతారని, అప్పుడప్పుడు నిజాలు కూడా మాట్లాడాలని ఓవైసీ అన్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం రికార్డు స్థాయిలో ఉంద‌ని, నిరుద్యోగం భయంకరంగా ఉందని, తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం దేశంలోనే అత్య‌ధిక స్థాయిలో ఉందన్నారు. 'ద‌ళిత ముస్లింల‌ను ఆద‌రించాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ చెబుతుంటారు. అమిత్‌ షానేమో వాళ్ల రిజర్వేషన్లు తొలగించాలని అంటారు. ఫేక్ ఎన్‌కౌంట‌ర్లు చేయ‌డం.. హైద‌రాబాద్‌పై స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేయ‌డం, క‌ర్ఫ్యూలు పెట్ట‌డం, క్రిమిన‌ల్స్‌ను వ‌దిలేయ‌డం, బుల్డోజ‌ర్ల‌ను దింప‌డ‌మే బీజేపీకి తెలుసు' అని ఓవైసీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశం అమిత్‌ షాకు ఉంటే రిజ‌ర్వేష‌న్ల‌పై ఉన్న 50 శాతం సీలింగ్‌ను రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Updated On 24 April 2023 6:06 AM GMT
Ehatv

Ehatv

Next Story