హిట్ అండ్ రన్ యాక్ట్ (Hit and Run Act) వల్ల దేశ వ్యాప్తంగా ట్రక్, ట్యాంకర్లు చేపట్టిన ధర్నా కారణంగా హైదరాబాద్‌లో భారీగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) కొరత ఏర్పడింది. ట్రాఫిక్ రద్దీ (Traffic Jam), పెట్రోల్ కొరతతో ఫుడ్ డెలివరీ (Food Delivery) ఇన్‌టైంలో చేరలేదు.
హిట్ అండ్ రన్ యాక్ట్ (Hit and Run Act) వల్ల దేశ వ్యాప్తంగా ట్రక్, ట్యాంకర్లు చేపట్టిన ధర్నా కారణంగా హైదరాబాద్‌లో భారీగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) కొరత ఏర్పడింది. ట్రాఫిక్ రద్దీ (Traffic Jam), పెట్రోల్ కొరతతో ఫుడ్ డెలివరీ (Food Delivery) ఇన్‌టైంలో చేరలేదు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ దాదాపు 3 గంటల పాటు పెట్రోల్ బంక్ దగ్గర లైన్‌లో నిల్చున్నా పెట్రోల్ దొరకపోవడంతో అసహనంతో వెనుదిరిగాడు. ఓ గుర్రం (Horse) తీసుకుని దానిపై ఫుడ్‌ను డెలివరీ చేశాడు. హైదరాబాద్ చంచల్‌గూడలో (Chanchalguda) ప్రాంతంలో డెలివరీ బాయ్ (Delivery Boy) గుర్రం మీద స్వారీ చేస్తూ ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేసేందుకు వెళ్తుండగా నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేయడంతో.. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. భలే ప్లానే వేశాడని నెటిజన్లు స్పందిస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రికల్ బైక్‌లున్న (Electric Bikes) బాయ్స్ మాత్రం ఫుడ్ డెలివరీ ఇన్‌టైంలో చేశారు. ఇన్‌టైంలో ఫుడ్ డెలివరీ కాలేదని పలువురు కస్టమర్లు వాపోతున్నారు. అయితే డ్రైవర్ల అసోసియేషన్లతో కేంద్రం చర్చలు సఫలం కావడంతో పెట్రోల్ బంకులకు ట్యాంకర్లు చేరుకుంటున్నాయి.