సంక్రాంతి పండుగ సందర్భంగా గాలి పటాలు ఎగురవేస్తున్న క్రమంలో నిన్న హైదరాబాద్ నగరంలో ఇద్దరు మైనర్లు మృత్యువాత పడ్డ విషయం మరవకముందే

Army Jawan Died China Kite Manja Accidentally Tied Neck
సంక్రాంతి(Sankranthi) పండుగ సందర్భంగా గాలి పటాలు(Kites) ఎగురవేస్తున్న క్రమంలో నిన్న హైదరాబాద్(Hyderabad) నగరంలో ఇద్దరు మైనర్లు మృత్యువాత పడ్డ విషయం మరవకముందే ఈరోజు మరో రెండు చోట్ల విషాదకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. చైనా మాంజా కారణంగా ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాదు నగరంలో చోటుచేసుకుంది. కోటేశ్వర్ రెడ్డి(30) అనే యువకుడు ఇండియన్ ఆర్మీ(Indian Army)లో పనిచేస్తున్నాడు. పండగ సందర్భంగా ఇంటికి వచ్చాడు. ఎంతో సంతోషంగా బండిమీద వెళ్తున్న సమయంలో లంగర్ హౌస్(Langar Hpuz) ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే అతని మెడకు చైనా మాంజ చుట్టుకుని మెడ కట్ అయిపో యింది. దీంతో కోటేశ్వర్ రెడ్డి(Koteshwar Reddy) ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోవడం గమనించిన స్థానికులు వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కోటేశ్వర్ రెడ్డి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని విశాఖపట్నం(Vishakapatnam) జిల్లాకు చెందిన కోటేశ్వర్ రెడ్డి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అతడి కుటుంబం లంగర్ హౌస్ లో నివాసం ఉంటుంది. నిన్న రాత్రి 7: 25 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
