శేరిలింగంపల్లి(Sherlingampally) ఎమ్మెల్యే అరికపూడి గాంధీ(arekapudi gandhi) చెప్పింది విన్నారుల్లా?
శేరిలింగంపల్లి(Sherlingampally) ఎమ్మెల్యే అరికపూడి గాంధీ(arekapudi gandhi) చెప్పింది విన్నారుల్లా? దేవుడి పేరుతో ఆయన ఆడుతున్న అబద్ధాలు వింటే కంపరం పుట్టుకొస్తుంది. గాంధీ అని మహాత్ముడి పేరు పెట్టుకున్న ఆయన సత్యమే పలకాలన్న ఆయన అడుగుజాడల్లో మాత్రం నడవడం లేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండటం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. మూడు నెలల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరినట్టు ప్రకటించుకున్న గాంధీ ఇప్పుడేమో తాను కాంగ్రెస్‌లో చేరలేదంటూ మాట్లాడుతున్నారు. నరం లేని నాలిక ఏమైనా మాట్లాడుతుందంటారుగా! కేవలం నియోజకవర్గ అభివృద్ది కోసమే రేవంత్‌రెడ్డిని కలిసానని ఇప్పుడు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీ సూచించిన సభ్యునికి ఇవ్వాల్సిన పీఏసీ కమిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే అరికపూడి గాంధీ దక్కడంతో ఆయనపై బోల్డన్ని విమర్శలు వస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికే ఇప్పుడు పార్టీ ఫిరాయించలేదని డ్రామా ఆడుతున్నారు. జూలై 13వ తేదీన రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. తన ఎక్స్ అకౌంట్‌లో రేవంత్‌రెడ్డితో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో సీనియర్ నాయకుడు మొవ్వ సత్యనారాయణ(), కార్పొరేటర్లు రాగం నాగేందర్‌యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్‌రెడ్డి, ని యోజకవర్గ సీనియర్ నాయకులు, ము ఖ్య అనుచరులు, అభిమానులతో కలిసి కాంగ్రెస్‌లో చేరడం జరిగింది’ అంటూ అందులో రాసుకొచ్చారు. పైగా ఈ ట్వీట్‌ను రేవంత్‌రెడ్డికి, రాహుల్ గాంధీకి(Rahul gandhi), ఐఎన్‌సీ తెలంగాణ, ఇండియాకు ట్యాగ్ చేశారు. అప్పుడేమో అంత అర్భాటంగా కాంగ్రెస్‌లో చేరినట్టు ప్రకటించుకున్న గాంధీ ఇప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో చేరనేలేదంటూ చెప్పడం చూసి అబద్ధం అనే పదం కూడా ఆశ్చర్యపోతున్నది. అన్నట్టు రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారుగా.. ఆయన కూడా అరికపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని ధ్రువీకరించారు. ఆయన కూడా తన ఎక్స్ అకౌంట్‌లో ఈ విషయాన్ని చెప్పారు. ‘శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పలువురు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. కాంగ్రె స్ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది’ అని ట్వీట్ చేశారు. ఓ ఫోటో కూడా పోస్ట్ చేశారు. ఇన్ని ఆధారాలు, ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ అరికపూడి గాంధీ మాత్రం నాలుక మడతేయడం ఆశ్చర్యం అనిపిస్తోంది. మరో విషయమేమిటంటే రేవంత్‌రెడ్డి ఆయనకు కప్పినది కాంగ్రెస్ కండువా కాదట! ఆలయాలలో కప్పే కండువా అట! దేవుడి పేరుతో ఇంత పచ్చి అబద్ధమా అని జనం ముక్కన వేలేసుకుంటున్నారు. !