భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

Appointment of special officers for flood prone districts
భారీ వర్షాలు(Heavy Rains), వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారుల(IAS Officers)ను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari) ఆదేశాలు జారీ చేశారు. ములుగు(Mulugu) జిల్లాకు కృష్ణ ఆదిత్య(Krishna Adithya), భూపాల పల్లి(Bhupalapalli) జిల్లాకు పి గౌతమ్(P Gowtham), నిర్మల్(Nirmal) జిల్లాకు ముషారఫ్ అలీ(Musharaf Ali), మంచిర్యాల జిల్లాకు భారతి హోలికేరి(Bharati Holikeri), పెద్దపల్లి జిల్లాకు సంగీత సత్యనారాయణ(Sangeetha Satyanarayana), ఆసిఫాబాద్ జిల్లాకు హన్మంత రావు(Hanmantha Rao) లను ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఈ మేరకు సమాచార, పౌరసంబధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రకటన జారీ చేశారు.
