ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని పది మంది మంత్రులను 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Appointment of in-charge ministers for Telangana joint districts
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేబినెట్(Cabinet)లోని పది మంది మంత్రులను 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులు(Incharge Ministers)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shanthi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో “ప్రజాపాలన కార్యకలాపాల” అమలును సమీక్షించి పర్యవేక్షిస్తారని ఉత్తర్వులలో వెల్లడించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) పాలనా సౌలభ్యం కొరకు 33 జిల్లాలను ఏర్పాటు చేయగా.. ప్రస్తుత సర్కార్ మాత్రం పాత ఉమ్మడి 10 జిల్లాలనే పరిగణలోకి తీసుకుని ఇన్‌చార్జ్ మంత్రులను నియమించడం గమనార్హం. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ ఇంఛార్జ్ మంత్రుల సంప్రదాయానికి స్వస్తి పలికింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మాత్రం తమ మార్కు పాలన అందించేందుకు ఇన్‌చార్జ్ మంత్రుల సంప్రదాయాన్ని మళ్లీ తెరమీదకు తీసుకువచ్చింది.
ఏయో జిల్లాకు ఏ మంత్రి అంటే..
1) ఉత్తమ్ కుమార్ రెడ్డికి -కరీంనగర్
2) దామోదర రాజనరసింహ- మహబుబ్ నగర్
3)కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి-ఖమ్మం
4)దుద్దిళ్ల శ్రీధర్ బాబు- రంగారెడ్డి
5)పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- వరంగల్
6)పొన్నం ప్రభాకర్- హైదరాబాద్
7)కొండ సురేఖ-మెదక్
8) సీతక్క- అధిలాబాద్
9) తుమ్మల నాగేశ్వర్ రావు-నల్గొండ
10) జూపల్లి కృష్టారావు -నిజామాబాద్
