ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్‌గా నియమిస్తూ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లుగా ప్రకటనలో పేర్కొంది.

Appointing Kaushik Reddy as party in-charge of Hujurabad constituency
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి బీఆర్ఎస్(BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) కీలక బాధ్యతలు అప్పజెప్పారు. కౌశిక్ రెడ్డిని హుజురాబాద్(Huzurabad) నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్‌గా నియమిస్తూ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్(KCR) ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లుగా ప్రకటనలో పేర్కొంది. ఇదిలావుంటే.. హుజురాబాద్ లో ఈటెల రాజేందర్(Etela Rajendar) కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. ఉప ఎన్నికలో విద్యార్ధి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్(Gellu Srinivas Yadav)ను ప్రత్యర్ధిగా దించారు. ఎన్నికకు ముందు నియోజకవర్గంలో పట్టున్న నేత, బీజేపీలో ఉన్నమాజీమంత్రి పెద్దిరెడ్డి(Peddi Reddy)ని పార్టీలో చేర్చుకున్నారు. ఇవేవి సత్ఫలితాలు ఇవ్వలేదు. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో తాజాగా కౌశిక్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికలలో ఈటెలకు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్న కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.
పాడి కౌశిక్ రెడ్డి.. స్వతాహాగా క్రికెటర్. హైదరాబాద్ జట్టు(Hyderabad Team)కు దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy) బంధువు. కౌశిక్‌రెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓటమి పాల్యయారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ(Congress)కి రాజీనామా చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి జులై 21వ తేదీ 2021న తెలంగాణ భవన్(Telangana Bhavan)లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్(CM KCR) సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు. అనంతరం సీఎం కేసీఆర్.. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేశారు. ఆ తరువాత ప్రభుత్వ విప్ కూడా అవకాశం కల్పించారు.
