కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు చేసుకోవాలని

Apply before 3rd February to contest in Parliament Elections
కాంగ్రెస్(Congress) పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections)లో పోటీ చేసే అభ్యర్థులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు చేసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Goud) తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్సీ(SC), ఎస్టీ(ST), వికలాంగుల అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు 25 వేల చొప్పున.. మిగతా వారు అందరూ ఒక్కో నియోజక వర్గానికి 50 వేల చొప్పున డీడీ(DD) చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు ఆన్ లైన్(Online) లో అందుబాటు లో ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
