సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఆవేదనకు గురి చేసిందన్నారు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఆవేదనకు గురి చేసిందన్నారు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Ap Deputy CM Pawan Kalyan).. ఇది దుర్మార్గమని, మహాపచారమని, దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలను ఏ మతానికి సంబంధించిన వారైనపట్టికీ సామూహికంగా కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఈ బాధ్యతను ప్రభుత్వాలు మీదనో, పోలీసుల మీదనో వేసి మనం బాధ్యత నుంచి దూరంగా ఉండరాదని చెప్పారు.

గత అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశానని, ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందూ దేవాలయాలను అపవిత్రం చేయడం అలవాటుగా మారిందని పవన్‌ చెప్పుకొచ్చారు. ఇలాంటి సంఘటనలను చూసీ చూడనట్లు వదిలేస్తే అది విపరీత పోకడలకు దారి తీస్తుందని, అదుపు తప్పుతుందని హెచ్చరించారు. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. అందుకే తిరుపతిలో జరిగిన సభలో వారాహి డిక్లరేషన్ లో చెప్పానని, ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని సనాతనధర్మ పరిరక్షకుడిగా మారిన పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ehatv

ehatv

Next Story