న్యూ ఇయర్ అంటేనే జల్సాలు..హైదరాబాద్ నగరమంతా ఒకటే సందడి. కేరింతలు..తుళ్లింతలు.. క్లబ్‌లు(Clubs), పబ్‌లు(Pubs) హోరెత్తిపోతాయి. పార్టీల పేరుతో యువత మత్తులో ఊగిపోతారు. ఇదే డ్రగ్స్(Drugs) మాఫియాకు వరంగా మారింది. ప్రతియేటా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్(New Year Celebratons) కేంద్రంగా వందల కోట్ల రూపాయల దందా సాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం రేవంత్(Revanth Reddy) ఆదేశించడంతో.. యాంటి నార్కోటిక్స్ పోలీసులు(Anti Narcotics Police) ప్రత్యేక దృష్టి పెట్టారు.
న్యూ ఇయర్ అంటేనే జల్సాలు..హైదరాబాద్ నగరమంతా ఒకటే సందడి. కేరింతలు..తుళ్లింతలు.. క్లబ్‌లు(Clubs), పబ్‌లు(Pubs) హోరెత్తిపోతాయి. పార్టీల పేరుతో యువత మత్తులో ఊగిపోతారు. ఇదే డ్రగ్స్(Drugs) మాఫియాకు వరంగా మారింది. ప్రతియేటా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్(New Year Celebratons) కేంద్రంగా వందల కోట్ల రూపాయల దందా సాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం రేవంత్(Revanth Reddy) ఆదేశించడంతో.. యాంటి నార్కోటిక్స్ పోలీసులు(Anti Narcotics Police) ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాదులోని పలు పబ్బులపై మెరుపుదాడులు చేసి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) డ్రగ్ ఫెడ్లర్లకు షెల్టర్ జోన్ గా మారింది. న్యూఇయర్ వేడుకలే టార్గెట్ గా ప్రతియేటా వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. చాపకిందనీరులా నగరంలో డ్రగ్ మాఫియా(Drugs Mafia) విస్తరించింది. డ్రగ్స్ అలవాటుపడిన యువత..అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి..డ్రగ్స్ మాఫియాపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు..యాంటీ నార్కోటిక్స్ శాఖను ఏర్పాటు చేసి..ప్రత్యేకంగా ఒక డైరెక్టర్ని కూడా నియమించారు. దీంతో ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు.
న్యూ ఇయర్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే పబ్ నిర్వాహకులు పలు ఈవెంట్లను ప్లాన్ చేశారు. ఈవెంట్లో డ్రగ్స్‌తో పాటు గంజాయి కూడా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. ఈసారి పబ్‌లలో డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై పోలీసులు దృష్టి సారించారు. కేవలం పబ్బులు మాత్రమే కాకుండా సిటీ శివారులో ఉండే ఫార్మ్ హౌస్(Farm House) లపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు. ఫార్మ్ హౌస్ లలో సైతం మత్తు పదార్థాల వినియోగం అధికంగా ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈసారి పబ్ లలో డ్రగ్స్ అమ్మకాలు కొనసాగిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. దీంతో సిటీ శివారులో గుట్టు చప్పుడు కాకుండా సెలబ్రేషన్స్ నిర్వహించాలనుకున్న యజమానుల్లో ఆందోళన మొదలైంది.
ఈసారి న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్ల సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో డ్రగ్స్ సప్లై చేసినట్టు ఆరోపణలు ఉన్న పబ్బులపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. మొత్తానికి డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం ఫలించాలని ఆశిద్ధాం..