తెలంగాణలో(telangana) కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పరిపాలనలో స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతి(corruption), పలు అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇటీవల పశుసంవర్ధకశాఖలోని గొర్రెల పంపిణీ స్కీమ్‌లో జరిగిన అవకతవకలు, ఫైళ్ల మాయంపై విచారణను ఏసీబీకి(ACB) అప్పగించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో(telangana) కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పరిపాలనలో స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతి(corruption), పలు అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇటీవల పశుసంవర్ధకశాఖలోని గొర్రెల పంపిణీ స్కీమ్‌లో జరిగిన అవకతవకలు, ఫైళ్ల మాయంపై విచారణను ఏసీబీకి(ACB) అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా సిరుల మాగాణి సింగరేణిలో(singareni) జరిగిన పలు నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టింది. దీంతో సింగరేణి నియామకాల్లో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సింగరేణిలో మెడికల్ ఇన్‌వాలిడేషన్ నియామకాల్లో(Appointment of Medical Invalidation) అవకతవకలు జరిగినట్టు సింగరేణి యాజమాన్యం గుర్తించింది. నియామకాల పేరుతో డబ్బు వసూలు చేసిన పలువురు ఉద్యోగులను ఇప్పటికే సింగరేణి యాజమాన్యం సస్పెండ్(Suspend) చేసింది. తాజాగా ఇదే అంశంపై సింగరేణి ఎండీ బలరాం(Balaram) ఏసీబీకి లేఖ రాశారు. దీంతో, ఏసీబీ డీఎస్పీ రమేష్(DSP Ramesh) నేతృత్వంలో సింగరేణిలో నియామకాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.