ఆర్థిక ఇబ్బందులు(Financial Problems), కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంతకల్లు(Gunthakallu) మండలం దోసలుడికి గ్రామానికి చెందిన కిష్టప్ప, లత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వ్యవసాయంతో(Farming) చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పంటల సాగుతో పాటు పిల్లల చదువులకు చేసిన అప్పుల భారం పెరిగి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.

ఆర్థిక ఇబ్బందులు(Financial Problems), కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంతకల్లు(Gunthakallu) మండలం దోసలుడికి గ్రామానికి చెందిన కిష్టప్ప, లత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వ్యవసాయంతో(Farming) చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పంటల సాగుతో పాటు పిల్లల చదువులకు చేసిన అప్పుల భారం పెరిగి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుమారుడు అనిల్‌(Anil) (21) తన చదువులు మధ్యలోనే ఆపి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా(Driver) పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. అప్పులు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి.ఉన్న భూమిని అమ్మి అప్పులు తీర్చేందుకు తండ్రి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి వాదించింది . ఉన్న భూమి కాస్త అమ్మితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని తండ్రితో గొడవపడేది. ఇక ఇదే విషయంపై దంపతుల మధ్య తరచూ వివాదం తలెత్తేది. దీంతో విసిగిపోయిన అనిల్‌ ఆదివారం సాయంత్రం తమ పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం ఇదే విషయాన్ని స్నేహితులకు ఫోన్‌ చేసి తెలిపాడు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన తల్లిదండ్రులకు అండగా నిలవాలని అభ్యర్థించాడు. స్నేహితులు వెంటనే అనిల్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. తల్లిదండ్రులు, స్నేహితులు పొలానికి చేరుకునేసరికి అపస్మారక స్థితికి చేరుకున్న అనిల్‌ను హుటాహుటిన గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

Updated On 6 Nov 2023 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story