ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ యాంకర్‌, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ యాంకర్‌, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన ట్వీట్ చేశారు. 'తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉండగా, పదేపదే అల్లు అర్జున్ గారి అంశాన్ని హైలైట్ చేయడం సరైన విధానం కాదు. ఇప్పుడు వారి ఇంటిపై దాడి జరగడం, ఆ ఘటనను హైలైట్ చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, దృష్టి పెట్టాల్సింది ప్రజల సమస్యలపై, రాష్ట్ర పాలనపైనే. ఇంతవరకు జరిగిన అంశాలు ఇవి: 29 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరిస్థితికి బాధ్యులు ఎవరు? వారిపై చర్యలు తీసుకున్నారా? 52 మంది గురుకులం విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టారు? 450 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిని ఈ దుస్థితికి నెట్టిన కారణం ఏమిటి? 140కి పైగా మహిళలు రేప్‌కు గురయ్యారు. వారికి న్యాయం చేయడం ఎందుకు ఆలస్యం అవుతోంది? 1085 మంది విద్యార్థులు విషాహారం తిని ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఈ ఘటనలపై ప్రభుత్వ చర్యలేమిటి? మీ ఒక్క సంవత్సరపు పాలనలోనే విద్యార్థుల నుంచి రైతుల వరకు, చేనేత కార్మికుల నుంచి మత్స్యకారుల వరకు ఎంత మంది ఇబ్బందులు పడ్డారు! ఇంతకీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమందికి నష్టపరిహారం అందించింది? సంద్య థియేటర్ ఘటన నిజంగా దురదృష్టకరం. కానీ, మీరు మీ రాజకీయ లబ్ధి కోసం ఆ అంశాన్ని సెన్సేషన్‌గా మార్చేందుకు ప్రయత్నించడం తగదు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టండి. రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలు, లైంగిక దాడులు, ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి. డైవర్షన్ పాలిటిక్స్ మానేసి ప్రజల కష్టాలకు నిజమైన పరిష్కారాలను కనుగొనండి. అల్లు అర్జున్ గారి సంఘటనపై మీరు, పోలీసులు ఎంతో శ్రద్ధ పెట్టారు. అదే శ్రద్ధను రాష్ట్రంలోని హత్యాచారాలు, దోపిడీలపై కూడా పెట్టండి. ముఖ్యంగా, మాజీ సర్పంచ్ లేఖలో ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి గారిపై చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపి మీడియా ముందు నివేదిక ఇవ్వండి. ఇలా ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించడమేనా తప్పు? రేపు లేక ఎల్లుండి ప్రశ్నలు అడిగినందుకు నాపై నోటీసులు లేదా అక్రమ కేసులు వేస్తారేమో! అయినా సరే, ప్రజల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ! జై జై తెలంగాణ!'' అంటూ శ్యామల ట్వీట్ చేశారు.

Updated On 23 Dec 2024 9:40 AM GMT
ehatv

ehatv

Next Story