కాలం ఎంత వేగంగా పరుగెడుతుందో దాంతో పాటే మన యువత కూడా దూసుకెళ్తున్నారు. సాంకేతికపరంగా కొత్త ఆలోచనలకు తెరలేపుతున్నారు. వినూత్నమైన ఆవిష్కరణలతో టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నారు. ప్రతిభతో స్టార్టప్‌లను స్థాపించి లక్షలు, కోట్లల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇందుకు మన తెలుగువారు కూడా తక్కువేం కాదండి. చదివింది ఐటీఐ అయినా కానీ కొత్త ఆవిష్కరణలకు నాంది పలికాడు తెలుగు యువకుడు అనంతకుమార్. పార్వతీపురంమన్యం జిల్లా పాలమిట్టలో పార్వతీ, ఘనపతి అనే దంపతులకు అనంత్‌కుమార్ జన్మించాడు. తల్లిదండ్రులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.

కాలం ఎంత వేగంగా పరుగెడుతుందో దాంతో పాటే మన యువత కూడా దూసుకెళ్తున్నారు. సాంకేతికపరంగా కొత్త ఆలోచనలకు తెరలేపుతున్నారు. వినూత్నమైన ఆవిష్కరణలతో టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నారు. ప్రతిభతో స్టార్టప్‌లను స్థాపించి లక్షలు, కోట్లల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇందుకు మన తెలుగువారు కూడా తక్కువేం కాదండి. చదివింది ఐటీఐ అయినా కానీ కొత్త ఆవిష్కరణలకు నాంది పలికాడు తెలుగు యువకుడు అనంతకుమార్(Anantakumar). పార్వతీపురంమన్యం(Parvathipuramanyam) జిల్లా పాలమిట్టలో పార్వతీ, ఘనపతి అనే దంపతులకు అనంత్‌కుమార్ జన్మించాడు. తల్లిదండ్రులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.

అయితే ఐటీఐ(ITI) మాత్రమే చదివిన ఇతను రూ.10 ఖర్చుతో మొబైల్‌ పవర్‌ బ్యాంక్‌ను(Mobile Powerbank) రూపొందించి చరిత్ర సృష్టించాడు. అసాధారణ ప్రతిభతో 10 రూపాయల ఖర్చుతో సెల్ ఫోన్‌కు(Cellphones) చార్జింగ్‌ చేసుకునేలా పవర్ బ్యాంక్‌ను రూపొందించాడు. అంతే కాకుండా రూ. 50 ఖర్చుతో సెలైన్ అలర్టర్‌ను కూడా తయారు చేసినట్లు వెల్లడించాడు. సెల్‌ఫోన్‌లో చార్జింగ్‌ అయిపోతే ఆ బాధ వర్ణనాతీతం. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ కోసం పవర్‌ బ్యాంకులను తీసుకెళ్తుంటాం. మార్కెట్‌లో చాలా పవర్‌ బ్యాంకులు ఉంటాయి. ఈ పవర్‌ బ్యాంకుల కోసం వేలల్లో ఖర్చు చేస్తుంటారు. కానీ అనంత్‌కుమార్‌(Ananth Kumar) తయారు చేసిన హెచ్‌ఐడబ్ల్యూ బ్యాటరీ(HIW Battery) ప్రైమరీ సెల్స్‌తో పవర్‌ బ్యాంక్‌ రూపొందించాడు. దీంతో కనిష్టంగా ఏడు రోజులపాటు చార్జింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుందని అనంత్‌కుమార్‌ తెలిపాడు. అంతేకాకుండా ఆస్పత్రుల్లో రోగులకు సెలైన్‌ పెట్టినప్పుడు దానిలో ఉన్న లిక్విడ్‌ అయిపోయిన తర్వాత అలర్ట్‌ ఇచ్చేలా మరో డివైస్‌ను కూడా ఆవిష్కరించాడు. రూ.50 ఖర్చుతోనే ఈ డివైజ్‌ తయారు చేసినట్లు తెలిపాడు. అంటువ్యాధులు అరికట్టేలా మరో పరికరం, మహిళల రక్షణ కోసం, వ్యవసాయం కోసం రకరకాల పరికరాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, టెక్‌ కంపెనీలు ప్రోత్సహిస్తే ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో చేయాలి ఉందని అనంత్‌కుమార్‌ తెలిపాడు.

Updated On 29 Feb 2024 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story