హైదరాబాద్‌లో(Hyderabad) నేరాలు పెరిగాయి.

హైదరాబాద్‌లో(Hyderabad) నేరాలు పెరిగాయి. రోజుకో సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దొంగతనాలు(Thefts), హత్యలు(Murders), లైంగికదాడులు(Sexual assaults), మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున గచ్చిబౌలిలో దారుణం జరిగింది. ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న యువతిపై ఓ ఆటో డ్రైవర్‌(Auto rape) అత్యాచారానికి ఒడిగట్టాడు. తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్‌సీ పురం దగ్గర బాధిత యువతి ఓ ఆటోలో ఎక్కింది. అయితే మసీద్‌బండ ప్రాంతంలో ఆటో డ్రైవర్‌ ఆమెపై లైంగిక దాడి చేశాడు. తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుని కోసం వెతుకుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story