తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు స‌న్నాహ‌కంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రచారానికి శంఖం ఊదనున్నారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు శనివారం రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, జిల్లా స్థాయి పార్టీ నేతలతో రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించిచారు. అనంత‌రం ర్యాలీకి లక్ష మందికి తక్కువ కాకుండా జనసమీకరణ చేస్తామని చెప్పారు.

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)కు స‌న్నాహ‌కంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఆదివారం రంగారెడ్డి(Rangareddy) జిల్లా చేవెళ్ల(Chevella)లో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రచారానికి శంఖం ఊదనున్నారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు శనివారం రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, జిల్లా స్థాయి పార్టీ నేతలతో రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్(Bandi Sanjay) టెలికాన్ఫరెన్స్ నిర్వహించిచారు. అనంత‌రం ర్యాలీకి లక్ష మందికి తక్కువ కాకుండా జనసమీకరణ చేస్తామని చెప్పారు.

ఈ స‌భ‌కు “విజయ్ సంకల్ప్ సభ” (పార్టీకి విజయం చేకూర్చేందుకు ప్రతిజ్ఞ చేసే సమావేశం) (Vijay Sankalp Sabha)గా నామకరణం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(K Chandrashekar Rao) నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (Bharatha Rastra Samithi) పాలనలో అవినీతితో కూరుకుపోయింద‌న్నారు. ఈ స‌భ ద్వారా కుటుంబ పాల‌న‌ను, నియంతృత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు అమిత్ షా పిలుపునిస్తారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్‌ చెప్పారు. ఈ సమావేశం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంద‌న్నారు. బీఆర్‌ఎస్‌(BRS)కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయమని ఈ స‌మావేశం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సందేశం పంపుతామ‌న‌ని సంజయ్ అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Elections) మ‌రికొద్ది రోజుల్లో ముగియ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారిస్తుందని సంజ‌య్‌ అన్నారు. ‘‘బీజేపీ అగ్రనేతలందరూ తెలంగాణలో జరిగే సమావేశాలు, కార్యక్రమాల్లో ప్రసంగించేందుకు తెలంగాణకు వస్తున్నారు. అమిత్ షా పర్యటన వచ్చే ఎన్నికల ప్రచారానికి నాంది అవుతుంది’’ అని సంజయ్ అన్నారు.

అమిత్ షా పర్యటన పార్టీ నాయకులు, క్యాడర్‌లో చైతన్యం నింపుతుందని.. పార్టీకి విజయాన్ని అందించడానికి అన్నివిధాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సంజ‌య్‌ అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలను వేధించే అవకాశం ఉంది. పార్టీ వారికి అండగా నిలుస్తుందని, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఉదయం హైదరాబాద్‌లో దిగనున్న షా, తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమై, రాబోయే నెలల్లో పార్టీకి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సూచించనున్నారు.

అమి త్ షా పర్యటనలో భాగంగా.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న “RRR” చిత్ర బృందం సభ్యులను కూడా కలుస్తారు. అవార్డు గెలుచుకున్నందుకు చిత్ర బృందాన్ని షా సత్కరిస్తారని బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Updated On 22 April 2023 10:55 PM GMT
Yagnik

Yagnik

Next Story