భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతూ ఉంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు
భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతూ ఉంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనతో మొదలవ్వనున్నాయి. నేడు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. బీజేపీ అగ్రనేత పార్టీ సోషల్ మీడియా వ్యూహకర్తలతో సంభాషించనున్నారు. పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో కూడా ఆయన మాట్లాడనున్నారు. ‘విజయ్ సంకల్ప్ సమ్మేళన్’ పేరుతో ఈ సమావేశం ఎల్‌బీ స్టేడియం లో జరగనుంది. వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఆయన దిశానిర్దేశం చేస్తారు.
గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలని.. ప్రధానిగా నరేంద్ర మోదీని ఎన్నుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా లక్ష్యాన్ని సాధించడానికి హెచ్‌ఎం అమిత్ షా పార్టీ కార్యకర్తలకు రోడ్‌మ్యాప్‌ను సెట్ చేసే అవకాశం ఉంది. అమిత్ షా చివరిసారిగా డిసెంబర్ 28న హైదరాబాద్‌కు వచ్చారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
నేటి పర్యటన వివరాలు:
మధ్యాహ్నం ఒంటి గంట ఇరువై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న షా
1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో దిశా నిర్దేశం చేయనున్న అమిత్ షా
3.15 నుంచి 4.25 వరకు LB స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొననున్న షా
4.45 నుంచి 5.45 వరకు ITC కాకతీయలో ముఖ్య నేతలతో సమావేశం
6.10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం