కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌(Congress)కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్‌ఎస్‌(BRS)లో చేరుతారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Sha) అన్నారు. కేసీఆర్‌(KCR)ను గద్దె దించాలంటే బీజేపీకి(BJP) ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించలేక గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య బీఆర్‌ఎస్ వివాదం సృష్టిస్తోందని మండిపడ్డారు. గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష‍్యం చేశారని దుయ్యబట్టారు.

ములుగుMulugu)లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. గిరిజనులను మోసం చేయడం కాంగ్రెస్ లక్షణమని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోడీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉన్నారని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క పండుగలను జాతీయ పండుగగా చేయాలని ప్రకటించామని చెప్పారు.

కేసీఆర్‌ను ఇంటికి సాగనంపే సమయం వచ్చిందని.. పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిమ‌యం అని అమిత్‌షా ఆరోపించారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించేవని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రుల భూ కబ్జాలకు అడ్డులేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వల్లే కాళేశ్వరంలో ప్రాజెక్టు కుంగిపోయింది. రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం అభివృద్ధి చెందలేదు. మత్స్యకారుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి నిధులిస్తామని అమిత్‌షా అన్నారు.

Updated On 26 Nov 2023 5:40 AM GMT
Yagnik

Yagnik

Next Story