తండాను సొంత గ్రామంలో విలీనానికి ఒప్పుకొని తండా వాసులు.
తండాను సొంత గ్రామంలో విలీనానికి ఒప్పుకొని తండా వాసులు. మా తండాలో మా రాజ్యం అంటూ తండా వాసులు నినదించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్ నుండి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే తన బలంతో పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి నేడు గ్రామసభ ఏర్పాటు చేయగా.. అధికారులు, కాంగ్రెస్ నాయకులను తండా ప్రజలు నిలదీశారు. తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులు మా తండా పైకి వచ్చి మాపై దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని... మా తండాను ఎట్టి పరిస్థితిలో అమీనాబాద్ గ్రామంలో కలపకూడదని తిరుగుబాటు చేశారు. మా తండాను యధావిధిగా గ్రామపంచాయతీగా కొనసాగించాలని.. అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తండా వాసులు.దీంతో గ్రామసభ ఏర్పాటు చేయకుండా వెనుదిరిగారు.