వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను చంపిన రజిత భర్త తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను చంపిన రజిత భర్త తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రియుడి కోసం ముగ్గురుపిల్లల్ని హతమార్చిన రజిత భర్త ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. తనతో ఉండటం ఇష్టం లేకపోతే తనకు ఇష్టమున్న వాడితో పోవాల్సింది.

పిల్లలు పదేపదే గుర్తొస్తున్నారు.. పిల్లలతో పాటు నేను చనిపోయినా బాగుండేది. బతికుండి క్షణక్షణం నరకం చూస్తున్నానని కన్నీటి పర్యంతం అయ్యాడు. పిల్లలకి విషమిచ్చి ఊపిరి ఆడకుండా చంపేసి.. తాను నటించిందని తప్పించుకోవాలని చూసిందని అన్నాడు. తన ఆస్తి కోసమే ఆమె రజిత ఇలా చేసిందని అన్నాడు. అందువల్లనే ఇంత క్రూరత్వానికి పాల్పడిన తన భార్యను, దీనికి కారణమైన శివను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశాడు. క్షణక్షణం తనకు తన పిల్లలే గుర్తొస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య.. భార్య రజితతో కలిసి కాపురం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌. రజిత ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తుంది. ఈ దంపతులకు సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్(8) ముగ్గురు పిల్లలున్నారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. రజితకు, చెన్నయ్యకు మధ్య 20ఏళ్ల గ్యాప్‌ ఉంది.

ఈ మధ్య కాలంలో రీయూనియన్లు ఫ్యాషన్‌ అయిపోయింది. ఆరు నెలల క్రితం పదో తరగతి రీయూనియన్‌ సందర్భంగా రజిత క్లాస్‌మెట్‌ శివతో పరిచయమైంది. ఇద్దరూ నెంబర్స్ మార్చుకున్నారు. ఆ తర్వాత చాటింగ్.. దెన్ డేటింగ్‌ ఇలా మొదలైంది వీరి కథ. చాలా సార్లు శారీరకంగా కలుసుకున్నారు. భర్తతో ఏజ్‌ గ్యాప్‌ ఉండడం, ప్రియుడి మోజులో పడి పిల్లలమీద ప్రేమ తగ్గడంతో ఎలాగైనా శివను పెళ్లి చేసుకోవాలని భావించింది. వెంటనే పెళ్లి చేసుకోవాలని శివకు ప్రపోజ్ చేసింది.నీకు పెళ్లి కాకపోయి, పిల్లలు లేకుంటే పెళ్లి చేసుకునేవాడినని శివ అన్నాడు. భర్త, పిల్లలను అడ్డుతొలగిస్తానని శివకు చెప్పడంతో సరే అన్నాడు. దీంతో గత పెరుగులో విషం కలిపిన రజిత, పిల్లలకు పెట్టింది. భర్త చెన్నయ్య పేరుగుతో అన్నం తినకపోవడంతో బయటపడ్డాడు. పని కోసం బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి పాపం పసిపిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. కామలేడీ మాత్రం తనకు కడుపు నొప్పి ఉందని నాటకం ప్రారంభించింది. ఆస్పత్రిలో చేర్పించిన చెన్నయ్య.. పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో భాగంగా తొలుత భర్తనే అనుమానించారు పోలీసులు. విచారణలో భార్య రజితే పిల్లలను చంపిందని తేలడంతో నిందితురాలు రజిత, ప్రియుడు శివను అదుపులోకి తీసుకున్నారు.

ehatv

ehatv

Next Story