Amberpet Shankar In BRS : బీఆర్ఎస్ లో చేరిన అంబర్‌పేట శంకర్
తెలంగాణలో ఎన్నికల(Telangana Elections) సందడి కొనసాగుతుంది. అభ్యర్ధుల ప్రకటన మొదలు పార్టీల మార్పు, ప్రచారం హడావుడి రాష్ట్రంలో జోరుగా సాగుతుంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారారు.

Amberpet Shankar In BRS
తెలంగాణలో ఎన్నికల(Telangana Elections) సందడి కొనసాగుతుంది. అభ్యర్ధుల ప్రకటన మొదలు పార్టీల మార్పు, ప్రచారం హడావుడి రాష్ట్రంలో జోరుగా సాగుతుంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారారు. అధికార బీఆర్ఎస్(BRS) నుంచి కొందరు కాంగ్రెస్(Congress) తీర్ధం పుచ్చుకోగా.. మరికొందరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ రెండు పార్టీలు కాకుంటె బీజేపీ(BJP) జెండకు జై కొడుతున్నారు.
తాజాగా అంబర్ పేట శంకర్(Amberpet Shankar) కూడా బీఆర్ఎస్‌లో చేరారు. శుక్రవారం మంత్రి న్నీరు హరీష్ రావు(Harish Rao) సమక్షంలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో చిన్నబోయిన శంకర్ ముదిరాజ్ అలియాస్ అంబర్ పేట శంకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.. అంబర్‌పేట శంకర్‌కు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట తన అనుచర గణం కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుని.. అంబర్ పేట గడ్డపై మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని అంబర్ పేట శంకర్ తెలియజేశారు.
