తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే(Alok Aaradhe) ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో(Rajbhavan) జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundhara Rajan).. జస్టిస్ అలోక్ ఆరాధేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో(CM KCR) పాటు ప‌లువురు మంత్రులు పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే(Alok Aaradhe) ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో(Rajbhavan) జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundhara Rajan).. జస్టిస్ అలోక్ ఆరాధేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో(CM KCR) పాటు ప‌లువురు మంత్రులు పాల్గొన్నారు. అలోక్ ఆరాధే గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అలోక్ ఆరాధే ఏప్రిల్ 13, 1964న రాయ్‌పూర్‌లో జన్మించారు. జూలై 12, 1988న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2007 ఏప్రిల్ మాసంలో అలోక్ ఆరాధే సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. 2011లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 నుండి 2018 వ‌ర‌కూ ఆయన జమ్మూ కాశ్మీర్ తాత్కాలిక న్యాయ‌మూర్తిగా పనిచేశారు. 2018లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ త‌ర్వాత‌ జూలై 3, 2022న కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

Updated On 23 July 2023 3:01 AM GMT
Ehatv

Ehatv

Next Story