☰
✕
సంధ్య థియేటర్ వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటపై అల్లు అర్జున్ టీమ్ స్పందించారు.
x
సంధ్య థియేటర్ వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటపై అల్లు అర్జున్ టీమ్ స్పందించారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ(Sree teja) అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్(Allu Arjun's Team).. నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం అని.. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అని తెలిపింది. గత రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాము. మా ఆలోచనలు మరియు ప్రార్థనలు కుటుంబం మరియు వైద్య చికిత్స పొందుతున్న చిన్న పిల్లవాడితో ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి మరియు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని.. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది.
ehatv
Next Story