Kancharla Chandrasekhar Reddy : అల్లు మామను అడ్డుకుందెవరు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancharla chandrashekar Reddy) బీఆర్‌ఎస్(BRS) పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు కానీ బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancharla chandrashekar Reddy) బీఆర్‌ఎస్(BRS) పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు కానీ బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను ఆశించారు. తాను హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పటికీ అది తన స్వస్థలమని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అక్కడ నోముల భగత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. భగత్‌ను కాదని చంద్రశేఖర్‌రెడ్డికి బీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్ ఇస్తుందా అనే చర్చ అప్పట్లో జరిగింది. అల్లు అర్జున్ నేరుగా రంగంలోకి దిగి కేసీఆర్, కేటీఆర్‌లతో మాట్లాడారని, తన మామకు టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. నాగార్జునసాగర్‌లో చంద్రశేఖర్‌రెడ్డి ఓ ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలు కూడా చేపట్టారు. స్థానిక నేతలను కలుసుకున్నారు. కానీ అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌కే టికెట్ దక్కింది. దీంతో కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డికి నిరాశ తప్పలేదు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌ను వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చారు. అదీ కాకపోతే చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేద్దామనుకున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని గట్టిగా అనుకున్నారు చంద్రశేఖర్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి హామీ దొరికిందనే వార్తలు వచ్చాయి. కానీ చేవెళ్ల, మల్కాజ్‌గిరి రెండూ వేరేవాళ్లకు కేటాయించింది. కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డికి టికెట్ రాకుండా అడ్డుకున్నదెవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం!