అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారా..? తొక్కిసలాట ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ విషయంలో ఆయన ఓనిర్ణయానికి వచ్చాడా..?

అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారా..? తొక్కిసలాట ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ విషయంలో ఆయన ఓనిర్ణయానికి వచ్చాడా..? ఇంతకీ బన్నీ ఏం చేయబోతున్నారు.

అల్లు అర్జున్ కు సబంధించి వివాదం ఇంకా చల్లారలేదు. ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. రేవంత అసెంబ్లీ ప్రకటన తరువాత.. బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం, తన తప్పు లేదు అని చెప్పడం.. తనకు ఎవరు ఈవిషయం చెప్పలేదు అని అనడం..ఆతరువాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాలతో సహా జరిగింది ఇది అని చెప్పారు. సో అల్లు అర్జున్ విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

శ్రీతేజకు సహాయం అందలేదు అంటూ వస్తున్న విమర్శలపై కూడా అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ప్రెస్ మీట్ లో కూడా ఈ విషయంపై హింట్ ఇచ్చారు బన్నీ. శ్రీతేజకు పరిహారం ఎలా ఇవ్వాలి.. డబ్బులు ఇవ్వాలా..లేక ఫిక్స్ డిపాజిట్ చేయాలా.. అనేది ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇక ఈలోపు మైత్రీ మూవీస్ శ్రీతేజ్ కుటుంబానికి 50 లక్షల పరిహారం ను అందించినట్టు తెలుస్తోంది.

ఈ అమౌంట్ చెక్ ను శ్రీతేజ్ తండ్రికి నిర్మాతలు అందించారు. అయితే అల్లు అర్జున్ నుంచి అందించాల్సిన సహాయం కూడా శ్రీతేజ్ కు వారి ఫ్యామిలకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు శ్రీతేజ్ పేరుతో 2 కోట్ల వరకూ అమౌంట్ ను ఫిక్స్ డిపాజిట్ చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో బన్నీ కాని బన్నీ టీమ్ కాని ఎటువంట ప్రకటన చేయలేదు.

అయితే అల్లు అర్జున్ ఇంటిముందు జరిగిన దర్నలో కూడా బాధిత కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాదు బయట నుంచి కూడా పరిహారం విషయంలో భారీ డిమాండ్లు వినిపిస్తున్న క్రమంలో.. అల్లు అర్జును తన ప్లాన్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఐకాన్ స్టార్ ఏం చేస్తారో చూడాలి.

ప్రస్తుతానికి ఈ మంటలు చల్లారలేదు. పొలిటికల్ గా డైలాగ్స్ పేలుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ మాత్రం కామ్ గా ఉన్నాడు. పొలిటికల్ లీడర్స్ మాత్రం ఈ విషయంలో కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అటు సోషల్ మీడియాలో కూడా ఈ విషయంలో డైలాగ్స్ పేలుతున్నాయి. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు లెటర్ రాశారు. ఎవరు తొందరపడి నోరు జారవద్దు.. పిచ్చి పిచ్చి పోస్ట్ లు పెట్టొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. చాలామంది ఫేక్ ఫ్రోఫైల్స్ తో ఫేక్ పోస్ట్ లు పెడుతున్నారని. వారిపై చర్యలు ఉంటాయన్నారు. మరి ముందు ముందు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Updated On 24 Dec 2024 6:01 AM GMT
ehatv

ehatv

Next Story