టాలీవుడ్ లోనే కాకుండా యావత్తు భారతదేశ వ్యాప్తంగా విస్తృత సంఖ్యలో అభిమానులున్న హీరో.

టాలీవుడ్ లోనే కాకుండా యావత్తు భారతదేశ వ్యాప్తంగా విస్తృత సంఖ్యలో అభిమానులున్న హీరో. అయినా ఫ్యాన్స్ కోసం ఏదయినా చేస్తారు. అంతెందుకు తనను కలవడానికి సుదూర ప్రాంతం నుంచి సైకిల్ మీద ఓ అభిమాని వస్తే అతడిని ఇంట్లోకి ఆహ్వానించి, తగిన సమయం వెచ్చించి తిరిగి పంపించిన అనుభవం అల్లు అర్జున్ ది. ఎక్కడో యూపీ నుంచి వచ్చిన అభిమానితో మనస్ఫూర్తిగా వ్యవహరించిన అల్లు అర్జున్ తీరు చూసిన ఎవరికైనా ఆయన ధోరణి అర్థమవుతుంది. అనుకోని ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. వీలయినంత వరకూ వాటిని నియంత్రించడం, సాధ్యం కాకపోతే నష్టాన్ని పూరించడానికి తోడ్పడడం మాత్రమే ఎవరైనా చేయగలం. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా స్పందించారు. సంధ్యా థియేటర్ దగ్గర తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పిదానికి కూడా తనవంతుగా తోడుకావాలని ఆశించారు. బాధితులకు భరోసా ఇచ్చే దిశలో అడుగులేశారు. గడిచిన 20 ఏళ్లలో సుమారు 30 సినిమాల వరకూ మొదటి రోజు అక్కడే సినిమా చూసిన అనుభవం ఆయనది. అయినప్పటికీ ఎన్నడూ లేనిది ఈసారి కారణమేదయినా జరిగిన నష్టాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి, ఆకుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలని సంకల్పించారు.

పుష్పా2 ప్రీమియర్ షో కేవలం ఫ్యాన్స్ ను సంతృప్తి పరచాలన్న లక్ష్యంతోనే అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. తద్వారా తను అభిమానుల హీరో అని చాటాలనుకున్నారు. ఇంట్లో చూడలేకనో, ఇంకెవరితోనో కలిసి ప్రివ్యూ వేసుకోలేకనో కాదు. కేవలం అన్ని సినిమాలు తాను ఎలా అయితే సంధ్యా థియేటర్లో చూస్తూ వచ్చారో అదే తరహాలో ఈసారి కూడా అభిమానుల స్పందన గమనించేందుకు థియేటర్ కి వచ్చారు. అయితే ఊహించని ఘటన జరిగింది. దానికి గానూ అందరికంటే ఎక్కువగా అల్లు అర్జున్ కలత చెందుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మాటలతో సరిపెట్టకుండా తన సిబ్బందిని ఆ కుటుంబానికి అండదండలు అందించే పనిలో ఉంచి చేతల్లోనూ చూపించారు.

ముక్కూ మొఖం తెలియని అభిమానం కోసం గంటల కొద్దీ సమయాన్ని కేటాయించిన హీరో, తన కోసం థియేటర్ వద్దకు వచ్చిన అభిమాని ప్రాణం పోతే ఎంతగా విలవిల్లాడిపోయారో ఊహిస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ఘటనలో నష్ట పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోకుండా, ఆస్పత్రిలో ఉన్న బిడ్డ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందు నిమిత్తం అవసరమైన ఖర్చు మొత్తం భరిస్తామని హామీ ఇచ్చారు. తాను ప్రకటించిన నష్టపరిహారంలో కొంత మొత్తం ఆరోజే బాధిత కుటుంబానికి అందించారు. తద్వారా వారికి తోడుగా ఉన్నామన్న సంకేతాలు పంపించారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. అల్లు అర్జున్ అండగా ఉంటున్నారన్న విశ్వాసాన్ని నింపారు.

ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించాలంటే అనేక సమస్యలుంటాయి. ఐసీయూలో ఉన్న వారిని పరామర్శించడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలకు ఆస్కారముంటుందన్న కారణం ఒకటైతే, మళ్లీ ఆస్పత్రి వద్ద అభిమానుల సందడి ఏర్పడితే అందరికీ సమస్యే కదా. ముఖ్యంగా ఆస్పత్రి నిర్వాహకులు, అక్కడ చికిత్స పొందుతున్న వాళ్లు కూడా సతమతం అవుతారు కదా. అందుకే కేవలం ఆస్పత్రికి నేరుగా వెళ్లలేకపోయినా కానీ అనుక్షణం ఆ కుటుంబ పరిస్థితిని, బాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. తన సిబ్బందిని ఆస్పత్రిలో ఉంచి బాబుకి సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. తల్లి లేని ఆ బిడ్డలకు అన్నీ తానై తోడుగా నిలిచేందుకు బన్నీ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రాణాలు తీసుకురాలేకపోయినా, రేవతి లేని లోటు ఆ కుటుంబానికి తెలియకూడదని భావిస్తున్నారు. మానవత్వంతో సాటి మనిషి కష్టాలను తనవిగా ఆలోచిస్తూ, వారికి చేదోడుగా నిలవాలని సంకల్పించారు. సమస్యల్లో ఉన్న ఆ చిన్న కుటుంబానికి పెద్ద భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లలో ఉన్నారు. ఆ కుటుంబం తిరిగి సంతోషంగా సాగేందుకు అనుగుణంగా అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు.

ఫ్యాన్స్ కష్టాలు తనవిగా భావించే పెద్ద మనసు అల్లు అర్జున్ ది. దానికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. అలాంటి ఉన్నత భావాలున్న కారణంగానే సాధారణ హీరో స్థాయి నుంచి ఇప్పుడు పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగారు. ఆయనెంత ఎంత ఉదారంగా వ్యవహరిస్తారో అభిమానులందరికీ తెలుసు. ఇప్పుడు కూడా బాధిత కుటుంబానికి అదే రీతిలో తోడునీడగా ఉండబోతున్నారు. అందులో సందేహం లేదు. అల్లు అర్జున్‌ ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఆ కుటుంబానికి అండగా ఉంటారనడంలో ఎలాంటి సంకోచం లేదదనడానికి పైఘటనలే ఉదాహరణ.

Updated On 23 Dec 2024 1:20 PM GMT
ehatv

ehatv

Next Story