సెన్సేషనల్ కేసు అయిన.. సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.
సెన్సేషనల్ కేసు అయిన.. సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన షూరిటీ కూడా ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చి సబ్మిట్ చేసి బెయిల్ ఆర్డర్ తీసుకున్నారు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల వద్ద హాజరు కావాలని షరతు ఉంది. మరికొన్ని షరతులను కూడా కోర్టు విధించింది. ఇప్పుడు దానికి సంబంధించి అల్లు అర్జున్ కు మళ్ళీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అల్లు అర్జున్ కు బెయిల్ రాగానే అందరూ ఒక విషయం గురించి చర్చించుకున్నారు. అదేంటంటే బన్నీ, హాస్పిటల్లో ఉన్న శ్రీ తేజ్ ను కలవడానికి వెళతాడా అని. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కు ఆ అవకాశం లేకుండా పోయింది. అతను శ్రీ తేజ్ ను చూడడానికి వెళ్లకూడదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన నోటీసులు ఆయన మేనేజర్ కు ఇచ్చినట్లు తెలుస్తుంది.
రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వచ్చి అల్లు అర్జున్ మేనేజర్ కు నోటీసులు అందజేశారు. సాక్షులను ప్రభావితం చేకూడదు అనే కండిషన్ ఉంది కాబట్టి, ఆయన హాస్పిటల్ కి వెళ్లి శ్రీ తేజ్ ను చూసే అవకాశం ఇవ్వలేదు. దీంతో బన్నీ అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు.