అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చినప్పటికీ సరైన పత్రాలు జైల్ అధికారులకు అందలేదు.

అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చినప్పటికీ సరైన పత్రాలు జైల్ అధికారులకు అందలేదు. దాంతో నిన్న రాత్రంతా అల్లు అర్జున్(Allu Arjun) జైల్ లో ఉండాల్సి వచ్చింది. ఇవాళ ఉదయం బన్నీ జైలునుంచి బయటకు వచ్చాడు. నిన్న రాత్రి బెయిల్ మంజూరు అయినా కొన్ని కారణాల వల్ల విడుదల అలస్యమయ్యింది. జైల్ అధికారులు అల్లు అర్జున్ ను అండర్ ట్రయల్ ఖైదీ గా పరిగణించి అతడికి 7697 నెంబర్ ఇచ్చారు. రాత్రి జైలు రిసెప్షన్ లో ఉంచారు. తర్వాత మంజీరా బ్యారక్ లోని క్లాస్ -1 రూమ్ కు తీసుకెళ్ళారు. అక్కడ బన్నీ తో పాటు మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నారట!

ehatv

ehatv

Next Story