అల్లు అర్జున్ వివాదం రోజుకోమలుపు తిరుగుతుంది. ఆయనపై కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు.
అల్లు అర్జున్ వివాదం రోజుకోమలుపు తిరుగుతుంది. ఆయనపై కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. ఈక్రమంలో సంధ్య థియేటర్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇంతకీ విచారణలో ఆయన్ను అడిగిన ప్రశ్నలు ఏంటి..?
అల్లు అర్జున్ ను వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటతో పాటు.. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కు సబంధించిన విషయాల్లో కూడా ఆయన్ను విచారించారు పోలీసులు. భారీ బదోబస్థ్ మధ్య అల్లు అర్జున్ విచారణ కొనసాగింది. ముందుగా నోటీసులు ఇచ్చిన పోలీసులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావల్సిందిగా బన్నీని కోరారు.. నోటీసులు అందిన ప్రకారం అల్లు అర్జున్ పోలీసులు ముందు హాజరయ్యారు.
ఈక్రమంలో అసలు సంధ్య థియేటర్ లో ఆరోజు జరిగిన సంఘటనను వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ విచారణలో అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా స్టేషన్ కు వచ్చారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు.ఇక విచారణకు ఒక ముద్దాయిలా హాజరయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అడిగిన ప్రశ్నలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పోలీసులు బన్నీని అడిగారు అని చెప్పబడుతున్న ఆ ప్రశ్నలు ఏంటంటే..
1. పర్మీషన్ లేకుండా సంధ్య థియేటర్ కు ఎందుకు వచ్చారు.? 2. మీరు థియేటర్ కు వస్తున్నట్టు ఎవరికి సమాచారం ఇచ్చారు..? 3. మీ పర్యటనకు పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరూ చెప్పలేదా..? 4. 800 మీటర్లకు పైగా రోడ్ షో చేశారు.. నిజం కాదా..? 5. ఈ రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా..? 6. రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్ లో ఉన్నప్పుడు తెలియదా..? ఏసీపీ, సీఐ మీమ్మల్ని కలిసింది నిజమా కాదా..? 7. ప్రెస్ మీట్ లో పోలీసులు నా దగ్గరకు రాలేదు అని ఎందుకు అన్నారు. 8. రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది..? 9. థియేటర్ కు మీతో పాటు మీఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారు..? 10. మీతో వచ్చిన బౌన్సర్ల వివరాలు ఏంటి..? 11. మీరు థియేటర్ లో ఎంత సేపు ఉన్నారు..? 12 తిరిగి వెళ్లేప్పుడు కూడా కారు పైకి వచ్చి అభివాదం ఎందుకు చేశారు..? 13. ప్రెస్ మీట్ లో మీరు చెప్పిన విషయాలపై మీ వివరణ ఏంటి..? అంటూ ఇలా ఇంకా పలు ప్రశ్నలు అల్లు అర్జున్ ను పోలీసులు అడిగినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరి ఈ ప్రశ్నలు అడగడంలో నిజం ఎంత..? ఈ ప్రశ్నలకు బన్నీ సమాధానం ఏంటి..? సాక్ష్యాలతో పోలీసులు చెప్పిన తరువాత అతను ఏం మాట్లాడారు అనేది తెలియాల్సి ఉంది.ఇక సంద్యథియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఈ వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. పోలీసులు పర్మీషన్ లేకుండా.. వారు వద్దన్న థియేటర్ కు వచ్చారని, రోడ్ షో చేసి ఒక ప్రానం పోవడానికి కారణం అయ్యారని, పోలీసుల మాటలు నిర్లక్ష్యం చేశారని.. ఇలా రకరకాల అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ ఫస్ట్ డే ఫస్ట్ షోకు.. తన ఫ్యామిలీతో కలిసి వచ్చి సందడి చేశారు.
అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దాంతో అల్లు అర్జున్ బౌన్సర్లు జనాలను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ పిల్లోడు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ ఈ కేసులో ఏ 11గా ఉన్నారు. ఆతరువాత జరిగిన పరిణామాలు తెలిసినవే. జైల్లో ఒక నైట్ ఉండటం. విడుదల తరువాత సెలబ్రిటీలు బన్నీ ఇంటికి క్యూ కట్టడం, ఈ విషయంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కామెంట్ చేయడంతో మరోసారి వివాదం చెలరేగింది. అయితే వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో కాంట్రవర్సీ మరింత ముదిరింది. అల్లుఅర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అబద్దాలంటూ..పోలీస్ శాఖ.. సాక్ష్యాలతో సహా మరో ప్రెస్ మీట్ పెట్టింది. దాంతో బన్నీకేసు మరింత స్ట్రాంగ్ అయ్యింది.