పుష్ప2 ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై హీరో అల్లు అర్జున్ (Allu Arjun) స్పందించారు.

పుష్ప2 ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై హీరో అల్లు అర్జున్ (Allu Arjun) స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. తాము పుష్ప 2 ప్రీమియర్ షోకి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌కు వెళ్లామని, అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలాయని తెలిసిందని, ఇద్దరు పిల్లల తల్లి రేవతి గారు చనిపోయారని తెలియగానే మా చిత్ర బృందం అంతా షాక్ కు గురయ్యామని అల్లు అర్జున్ చెప్పారు. 'థియేటర్ కి వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూడటమనేది 20 ఏళ్లుగా నాకు ఆనవాయితీగా వస్తున్నది. ప్రేక్షకులకు వినోదాన్నిచ్చే సినిమా థియేటర్ వద్ద అలా జరగడం బాధగా ఉంది. రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. ఎంత చేసినా ఆమె లేని లోటు తీర్చలేనిది. నా తరపున రూ.25 లక్షలు సాయం చేయాలని నిర్ణయించుకున్నా’ అని తన ఎక్స్ అకౌంట్ లో అల్లు అర్జున్ తెలిపారు.
