చట్టాన్ని గౌరవించి, చట్టం ముందు అందరూ సమానులేనని భావించే మనిషి అల్లు అర్జున్.

చట్టాన్ని గౌరవించి, చట్టం ముందు అందరూ సమానులేనని భావించే మనిషి అల్లు అర్జున్. అందుకే పోలీసులకు సహకరించడం నుంచి కోర్టు ఆదేశాలను పాటించడం వరకూ అన్నింటా తన ధోరణి చాటుకుంటున్నారు. ఆ క్రమంలోనే తన బెయిల్ షరతులను గమనంలో ఉంచుకుని వాటికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. కోర్టు ఆదేశాలను పాటించే పనిలో ఉన్నారు. ఇదే నేరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి బన్నీకి ఆటంకమయ్యింది. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా అడుగులు వేయాలంటే అడ్డంకులు కనిపిస్తున్నాయి. తన తండ్రి అల్లు అరవింద్‌ను పురమాయించి ఆస్పత్రికి పంపించడానికి కూడా కారణమదే.

చట్టం పరిధి తెలిసిన వ్యక్తిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా అల్లు అర్జున్ కోర్టు షరతులను అనుసరిస్తున్నారు. అదే ఇప్పుడు ఆయనకు అనేక పరిమితులు విధించడానికి కారణమయ్యింది. కొందరు రాజకీయ నేతలు, చట్టం మీద గౌరవం లేని వాళ్లు తమ బెయిల్ షరతులను యధేశ్ఛగా ఉల్లంఘిస్తూ ఉంటారు. కొన్నిసార్లు న్యాయస్థానాలు వారిని మందలించిన సందర్భాలు కూడా చూశాము. కానీ బన్నీ అందుకు భిన్నం. చట్టం పరిధిలోనే తను చేయాలనుకున్నది చేసే మనస్తత్వం ఉన్న మనిషి. అందుకే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధిత కుటుంబాన్ని కలవాలని, వారికి భరోసా కల్పించాలని మనస్ఫూర్తిగా ఉన్నప్పటికీ ముందడగు వేయలేకపోతున్నారు. సాయం చేయాలన్న సంకల్పం ఉన్నప్పటికీ చేతులు కట్టుకుని సాగుతున్నారు. తను వెళ్లలేకపోయినా తన వాళ్ల ద్వారా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నామన్న సంకేతాలు పంపిస్తున్నారు. బాధితుల్లో గుండె ధైర్యాన్ని నింపేందుకు తహతహలాడుతున్నారు.

అల్లు అర్జున్ మనిషి మాత్రమే ఇంట్లో ఉన్నారు. మనసంతా రేవతి బిడ్డ చుట్టూనే ఉందడానికి అనేక ఉదాహరణలున్నాయి. చివరకు పోలీసుల అనుమతి తీసుకుని తండ్రి అల్లు అరవింద్ ను పంపించి, వారిని పరామర్శించేందుకు సిద్ధపడిన తీరు అందుకో సాక్ష్యం. అనునిత్యం తన మనుషులతో ఆస్పత్రిలో అవసరమైన అన్ని రకాల సహాయం అందించడం కోసం పడుతున్న తపన తార్కాణంగా కనిపిస్తోంది.

తెలంగాణా హైకోర్టు మధ్యంతర బెయిల్ లో పెట్టిన షరతులు ఓసారి గమనిస్తే ఆయన విచారణకు సహకరించాలన్నది ప్రధానమైనది. అంటే దాని అర్థం ఫిర్యాదుదారుడు, బాధిత కుటుంబం వారితో నేరుగా కలవడం షరతుల ఉల్లంఘన అవుతుంది. వారికి ఏవిధంగా సహాయం అందించే ప్రయత్నం నేరుగా చేసినా నేరంగా పరిగణించబడుతుంది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా అది చేయకూడని పని. అంతేగాకుండా కేసు దర్యాప్తునకు అవసరమైన ఆధారాలు ఉద్దేశపూర్వకంగా తొలగించే ప్రయత్నం చేసినట్టుగా పరిగణించి కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు మరో నేరం కూడా అవుతుంది. ప్రయాణాలు సహా ఇతర అనేక పరిధులు కోర్టు విధించిన తర్వాత వాటిని అతిక్రమించడం చట్టరీత్యా తగదుగనుకనే నేరుగా అల్లు అర్జున్ బాధిత కుటుంబం చెంతకు వెళ్లలేకపోతున్నారు. లేదంటే అనుక్షణంలో ఇంట్లో ఆ కుటుంబం గురించి ఆలోచిస్తూ గడుపుతున్న బన్నీ తక్షణమే ఆ పనిచేసి ఉండేవారు. అలాంటి అవకాశం ఉంటే తన మనసుకి కూడా సాంత్వన దక్కేది.

షరతులతో కూడిన బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నారు. అది మంజూరుకాగానే బాధితులకు ఆయనే స్వయంగా వెళ్లి పరామర్శిస్తారు. రేవతి కుటుంబానికి సాయంగా నిలుస్తారు. తల్లి లేని పిల్లలకు తోడునీడగా ఉంటారు. వారి కుటుంబం తిరిగి గాడిలో పడేందుకు అవసరమైన అన్ని రకాలుగా అండదండలు అందిస్తారు. అందుకు అల్లు అర్జున్ ఎదురుచూస్తున్నారు. రెగ్యులర్ బెయిల్ ఎప్పుడు వస్తే వెంటనే వెళ్లి సాయంచేస్తారు. ఎవరెన్ని నిందలు, అపవాదులు వేసినా అల్లు అర్జున్ ఆ కుటుంబానికి అండగా ఉంటారు.

Updated On 23 Dec 2024 1:24 PM GMT
ehatv

ehatv

Next Story