హైదరాబాద్ సంధ్య థియేటర్ ప్రాంగణం లో డిసెంబర్ 4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయారు అన్న విషయం తెలిసిందే!
హైదరాబాద్ సంధ్య థియేటర్ ప్రాంగణం లో డిసెంబర్ 4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయారు అన్న విషయం తెలిసిందే! ఈ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టైన విషయం కూడా తెలిసిందే! గత శుక్రవారం బన్నీ అరెస్ట్ అయ్యాడు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఈ బెయిల్ రద్దు కానుందంటూ ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నది. హైకోర్టు జారీ చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్ రద్దు చేసేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బెయిల్ రద్దు చేసే విషయంపై పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారని తెలిసింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పేం లేదని, పోలీసులే ఫెయిల్ అయ్యారంటూ ఓ వైపు చర్చ జరుగుతున్న నేపథ్యం లో సంధ్య థియేటర్(Sandhya Theatre) విజిట్‌కు వెళ్లేందుకు అల్లు అర్జున్ టీంకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ ఓ నివేదిక బయటకు వచ్చింది. పోలీసులు ఇదే రిపోర్ట్‌తో సుప్రీంకోర్టు(SupremeCourt)ను ఆశ్రయించి మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోరనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఏదైనా ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు.