allahabad court on women maternity leave : ఆడవాళ్లకు ప్రసూతి సెలవుల విషయంలో కోర్టు సంచలన తీర్పు.!
అలహాబాద్ కోర్టు(Allahabad High Court) మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే విధంగా ఒక కేసులో అనూహ్యమైన తీర్పుని ప్రకటించటంతో మహిళాఉద్యోగుల్లో సంతోషం వెల్లువెత్తుతుంది . ఉదోగ్యం చేసే ఆడవాళ్లు అటూ ఇంటిని ఇటు వృత్తిని కూడా సమంగా వ్యవహరిస్తూ రావాలి. ఆడవాళ్లకు ఉండే ఇతర ఇబ్బందులలో కానీ ప్రత్యేకమైన అలవాలంటూ ఏమీ ఎక్కడా ఉండవు . ప్రసూతి సమయంలో కూడా చాలా మంది తమ నెల వారి జీతం పోకూడదు అనే భావంతో నెలలు నిండిన ఉద్యోగం చేస్తుంటారు.. ఇలా మనం చాల చోట్ల చాలా మంది ఆడవాళ్లను చూస్తుంటాం.

అలహాబాద్ లో ప్రాథమిక విద్యాధికారి అసిస్టెంట్ టీచర్ సరోజ్ కుమారి ప్రసూతి సెలవల కోసం అప్లై చేసింది. బిఎస్ఏ దానిని రిజెక్ట్ చేసింది. బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ముందు ప్రసూతి సెలవుల కోసం ఈమె అప్లై చేసిందని నవంబర్ 14 2022న రిజెక్ట్ చేసింది. బిడ్డ పుట్టిన తర్వాత చైల్డ్ కేర్ లీవ్ ఉంటుందని మేటర్నిటీ లీవ్(maternity leave) ఆమె పొందలేదని చెప్పారు.దీనితో టీచర్ సరోజ కోర్ట్ లో తన సమస్యను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దానికి స్వీకరిస్తూ జస్టిస్ అశుతోష్ శ్రీవాస్తవ(Justice Ashutosh Srivastava) మహిళా ప్రసూతి సెలవలు, బిడ్డ పుట్టాక శిశు సంరక్షణ కోసం తరవాత తీసుకొనే సెలవలు వేరు వేరు అని ఉత్తర్వులని జారీ చేయడం జరిగింది. ఈ రెండు ప్రయోజనాలను కూడా మహిళా ఉద్యోగి పొందొచ్చు. రెండు వేరు వేరు అని కోర్టు చెప్పటం జరిగింది.
ఆడవాళ్లకు ప్రసూతి సెలవుల విషయంలో కోర్టు ఇచ్చిన ఈ తీర్పుకి మహిళా ఉద్యోగుల్లో ఆనందం నింపుతుంది . ఈ తీర్పుతో అయిన మిగిలిన యాజమాన్యాలు ఆడవాళ్ళ ప్రసూతి సమయంలో కానీ డెలివరీ తరువాత తీసుకొనే సెలవుల సమయంలో విధించే ఆంక్షలు విషయంలో జాగ్రత్తలు వహిస్తే మంచిది. చాలా ప్రైవేట్ మరియు ప్రభుత్వ కంపెనీ ల్లో పని చేసే ఆడవాళ్లకు ప్రసూతి సమయం లో 3 నెలల నుండి ఆరు నెలల వరకు శెలవును ప్రకటించటం జరుగుతుంది. ఉద్యోగస్తులు వాటిని ఎలాంటి సమయంలో అయిన వినియోగించుకోవచ్చు. కానీ ప్రసవం తరవాత ప్రత్యేకంగా సెలవలు ప్రకటించే యాజమాన్యాలు చాలా తక్కువనే చెప్పాలి .ఇలాంటి పరిస్థితుల్లో అలహాబాద్ కోర్ట్ ఇచ్చిన తీర్పు మహిళా ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది .