Wines Shops : మందుబాబులకు అలర్ట్.. రేపు మద్యం దుకాణాలు బంద్
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(TS Assembly election) సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును(Security) ఏర్పాటు చేస్తున్నారు.

Wines Shops
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(TS Assembly election) సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును(Security) ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా రేపు హైదరాబాద్‌లో(Hyderabad) మద్యం(Alcohol) దుకాణాలు(Wine shops) మూసివేయాలని పోలీస్ కమిషనర్ సందీప్ శాండీల్యా(Sandeep Sandilya) ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించి వైన్ షాపులను ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్(Election Counting) జరగనుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డీజీపీ అంజనీకుమార్(DGP Anjanikumar) ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలపై భద్రత పెంచాలనీ.. అభ్యర్థులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
