జనశక్తి నాయకులు కూర రాజన్న, అమర్ లతో పాటు అక్రమంగా అరెస్టు చేసిన వాళ్లందరినీ బేషరతుగా విడుదల చెయ్యాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నేతలు

All those illegally arrested should be released unconditionally
జనశక్తి(Janashakti) నాయకులు కూర రాజన్న(Kura Rajanna), అమర్(Amar) లతో పాటు అక్రమంగా అరెస్టు(Arrest) చేసిన వాళ్లందరినీ బేషరతుగా విడుదల చెయ్యాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నేతలు విమలక్క(Vimalakka), కొమురన్న(Komuranna), సంతోష్(Santhosh) మాట్లాడుతూ.. జనశక్తి నాయకుడు కూర రాజన్న ఏప్రిల్ నెలలో జైలు నుండి విడుదలై కేసుల మీద కోర్టుకు హాజరవుతూనే ఉన్నారని తెలిపారు. కూర రాజన్న 12 రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. కూర రాజన్న అనారోగ్య సమస్యల గూర్చి వైద్యులు ఆయన సోదరుడైన అమర్ కు తెలిపారు. రాజన్నకు అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో, రాజన్నకు వైద్య సహాయకుడిగా ఉన్న వెంకటేష్ ద్వారా అమర్ కు తెలియడంతో రాజన్నను కలవడానికి వెళ్ళాడు. వైద్యం కోసం వెళ్ళిన కూర రాజన్నను, అతనికి అనారోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం వెళ్ళిన అమర్ లను, పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. కూర రాజన్నకు వైద్య సహాయకుడిగా ఉన్న వెంకటేష్(Venkatest) ఫోన్ స్విచ్ ఆఫ్(Phone Switchoff) వస్తుందని.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని అన్నారు. కూర రాజన్న, అమర్ లతో పాటు అక్రమంగా అరెస్టు చేసిన వాళ్లందరినీ తక్షణమే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అలాగే కూర రాజన్నకు వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
